మెటా దారిలో మరో కంపెనీ.. ఉద్యోగులకు ఉద్వాసన..?

0
203

ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ట్విటర్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ దారిలో ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలోని 13 శాతం అంటే దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ బుధవారం వెల్లడించారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆదాయం తగ్గడం నేపథ్యంలో పలు ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నాయి.

తాజాగా ఈ జాబితాలో స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ కూడా ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిస్నీ కొత్త నియామకాలను నిలిపేసింది. తాజాగా కంపెనీ సీఈఓ బాబ్ చాపెల్ ఓ మోమోలో ఉద్యోగుల తొలగింపు విషయం ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకునేందుకు మార్గాలను డిస్నీ అణ్వేషిస్తున్నట్లు.. వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని చాపెల్ కోరాడు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో పొదుపు మార్గాలను డిస్నీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల తొలగింపు కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిస్నీలో ప్రపంచవ్యాప్తంగా 1,90,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సీఈఓ బాబ్ చాపెల్ మెమోలో పేర్కొన్నాడు.

ఆదాయం పరంగా డిస్నీ పెద్దగా రాణించడం లేదు. దీనికి తోడు కంపెనీ షేర్లు పడిపోయాయాయి. 52 వారాల కనిష్ట స్థాయికి చేరాయి. అంతకుముందు వార్నర్ బ్రదర్స్, నెట్ ఫ్లిక్స్ లు తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇదే దారిలో డిస్నీ కూడా సిబ్బందిని తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మెటాతో పాటు ట్విట్టర్ ఈ మధ్య వార్తల్లో నిలిచాయి. ట్విట్టర్ టేకోవర్ తరువాత 50 శాతం సిబ్బందిని తొలగిస్తూ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు, మాంద్యం భయాలు టెక్ కంపెనీలు భయపెడుతున్నాయి. దీంతో తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here