కదిలే కాలంతో పోటీపడి ప్రయాణించాలి అని అనుకుంటాడు మనిషి.. అందుకు తగినట్లుగానే కొత్త ఊహలతో అద్భుత మార్పులు చేస్తూ ఎన్నో వాహనాలను కనుగొన్నాడు.. ఒకప్పుడు ఒక చోటు నుండి మరోచోటుకి చేరేందుకు కాలినడకనే వెళ్ళేవాడు..తరవాత జంతువులని ఉపయోగించాడు.. ఆ తరువాత సైకిల్, బైక్ , బస్సు, రైలు, ఈ వేగం సరిపోదని విమానాన్ని కనుగున్నారు..
సూదూర ప్రయాణ యాత్రలకు ఇది సులువైన మార్గం.. అత్యధిక దూరాన్ని అతి తక్కువ కాలం లో చేరవచ్చు విమానం ద్వార..అన్ని సవ్యంగా ఉంటె పర్లేదు కానీ అటు ఇటు అయినదంటే ప్రాణాల మీద ఆశవదులుకోవడమే.. ఎందుకంటే నీలమీదనో నీటి ఉపరితలం మీదనో అయితే ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే అవకాశం ఉంటుంది.. కానీ ఆకాశంలో అలా అవకాశం ఉండదు.. అందుకే ఏదైనా చిన్న సమస్య తలెత్తిన విమాన సంస్థలు ఆ సమస్యని గుర్తించి పరిష్కరించే వరకు రాకపోకల్ని నిలిపివేస్తాయి అనే సంగతి అందరికి తెలిసిందే.. ఎందుకంటే అలాంటి సంధర్బాటాలు కోకొల్లలు.. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే యునైటెడ్ కింగ్‌డమ్ లో చోటు చేసుకుంది ..
యునైటెడ్ కింగ్‌డమ్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. దీనితో ఆ దేశంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. కాగా ఆకాశ వీధిలో విమానాలు ఎగరకుండా కట్టుదిట్టం చేశారు.. దీనితో విమాశ్రయాలలో చిక్కుకున్న ప్రయాణికులు ఇబ్బందులని ఎదురుకుంటున్నారు..
బ్రిటన్‌లోని విమానయాన సంస్థలు ఈ ఘటన పైన స్పందిస్తూ బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తాయి, ఇంజినీర్లు లోపాన్ని కనుగొని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు, కనుక దేశంలో విమాన సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.. కలిగిన అంతరాయానికి చింతిస్తూ క్షమాపణలు చెప్తున్నాం అని ఆయ సంస్థలు వెల్లడించాయి.. కాగా కలిగిన సాంకేతిక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేదాని పైన ఇంకా స్పష్టతలేదు..