రాజులు పోయిన రాచరిక వ్యవస్థ కూలిన రోజులు మారిన.. ప్రాంతాలమధ్య ఆధిపత్య పోరు మాత్రం కనుమరుగవ్వలేదు.. ఈ ప్రంపంచలో పక్క దేశాలను ఆక్రమించుకోవాలనే ఆశ లేని దేశం ఆసక్తి చూపని దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారత దేశం.. భారత దేశం ఎవరిపైనా యుద్ధం చేయదు.. సమరానికి కాలుదువువ్వితే కాటికి పంపక మానదు.. ఇదే భారత దేశం తీరు.. కానీ మిగిలిన దేశాలు అలాకాదు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పక్క దేశాలని ఎప్పుడు ఆక్రమిచుకుందామా అని గోతికాడ నక్కలా చూస్తుంటాయి.. దీనికి ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధకాండ..
ఈ సంవత్సరం ఫిబ్రవరి లో మొదలైన రష్యా ఉక్రెయిన్ మద్య రాజుకున్న యుద్ధ జ్వాలా ఇప్పటికి రగులుతూనే ఉంది.. మొదట్లో ఉక్రెయిన్ పైన విజయం సాధించిన రష్యా ఉక్రెయిన్ లో చాల భాగాన్ని ఆక్రమించుకుంది.. కాగా ప్రస్తుతం ఉక్రెయిన్ తన వ్యూహాన్ని మార్చుకుంది.. డ్రోన్ల సహాయంతో రష్యా పైన యుద్ధం చేస్తుంది..
తాజాగా ఉక్రెయిన్ కి సంబంధించిన 42 డ్రోన్లని కూల్చి వేశామని రష్యా వెల్లడించింది.. దీన్ని బట్టే అంచనా వేయొచ్చు యుద్ధ జ్వాలలు ఏ స్థాయిలో ఎగసిపడుతునాయో.. ఇంకా రష్యా సైనిక శిబిరాలపైన దాడి చేసింది మేమె అని ఉక్రెయిన్ స్పష్టం చేసింది.. ఈ దాడిలో సైనిక ఆస్తులు పెద్ద మొత్తంలో దెబ్బ తిన్నాయని ఉక్రెయిన్ పేర్కొంది.. కాగా ఉక్రెయిన్ రష్యా రాజధాని అయినా మాస్కో పైన ద్రుష్టి సారిస్తోంది..
ఈ నేపథ్యంలో మాస్కోలో ఉక్రెయిన్ డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి.. దీనితో మాస్కో నగరంలోని 3 విమానాశ్రయాలని ప్రభుత్వం మూసివేసింది.. కాగా ఉక్రెయిన్ కి డ్రోన్లు అమెరికా, బ్రిటన్ వంటి పాశ్యాత దేశాలు పంపిణి చెయ్యగా వాటితో ఉక్రెయిన్ రష్యా పై యుద్ధం చేస్తుంది ..