నార్త్ కొరియా.. ఆకలి కేకల సామ్రాజ్యం.. అరాచకాలకు నిలువెత్తు రూపం.. అభివృద్ధికి అందనంత దూరం.. అయినా నా దేశం భూతాల స్వర్గం అని ప్రగ్దబాలు పలకడం ఆ దేశ నియంత స్వభావం.. బావిలోని కప్పకి నార్త్ కొరియా ప్రజలకి పెద్ద తేడా ఏం లేదు.. ఎందుకంటే బావిలోని కప్పకి బయట ప్రపంచం తెలీదు నార్త్ కొరియా ప్రజలని బయట ప్రంపంచం గురించి తెలుసుకోనివ్వరు..
అక్కడి ఆకృత్యాలని భరించలేక అక్కడ పుట్టి పెరిగిన ప్రజలే అక్కడినుండి పారిపోవాలని శతవిధాలా ప్రయత్నించి చివరికి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. కారణం ఎవరైనా దేశ సరిహద్దు ధాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అతి కిరాతకంగా చంపేస్తాడు ఆ దేశ నియంత కిమ్..ఎవరో ఒకరు ప్రాణాలకి తెగించి ఆ నరకం నుండి బయటపడిన వాళ్ళని అడిగితే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో వివరించిన సందర్భాలు లేకపోలేదు…
అలాంటి నార్త్ కొరియాని ఒక అమెరికా సైనికుడు శరణు కోరాడని నార్త్ కొరియా ప్రకటించింది…ఉత్తర కొరియా లోకి అక్రంగా ప్రవేశించిన అమెరికా సైనికుడిపై మొదటిసారిగా స్పందిస్తూ సైన్యంలో నెలకొన్న వివక్షలే అతను నార్త్ కొరియాని ఆశ్రయించేలా చేశాయని వ్యాఖ్యనించింది.. వివక్ష చూపడంతో తన మనసు విరక్తి చెంది అమెరికాలో పౌరుడిగా ఉండడం ఇష్టం లేక నార్త్ కొరియా సభ్యుడిగా ఉండాలనుకొని అతను ఆ దేశాన్ని దేశాన్ని శరణు వేడినట్టు వెల్లడించింది నార్త్ కొరియా.. సైన్యం లో పెరిగిన జాతి వివక్షలే ఎందుకు కారణం అని తెలియ చేసింది.. ట్రావిస్ ఉద్దేశ పూర్వకంగానే ఉత్తర కొరియాలో నివసించేందుకు సరిహద్దు దాటినట్లు ప్యాంగ్ యాంగ్ బృందాలు నిర్ధారించాయి.. అతన్ని నార్త్ కొరియా నుండి విడిపించేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తుంది..