మత్తు వదిలి చూడరా… మీరు పవళించింది ఈఫిల్ టవర్ పైనరా…!

0
39

గబ్బర్ సింగ్ చిత్రంలో మందు మహారాజుల గురించి సాహితీ సాహిత్యం అందించి ఒక హాస్యాస్పద పాట ఉంది… మందు బాబులం మేము మందుబాబులం.. మందుకొడితే మాకు మేమె మహారాజులం… తాగుబోతులంటే ఎందుకంత చులకన తాగివాగేది పచ్చినిజం గనుకనా అని ఆ పాటలో రచయిత వర్ణచినట్టు వాళ్లకి వాళ్ళు మహారాజులనుకున్నపర్లేదు… తాగి వాగినా తప్పులేదు కానీ మద్యం మత్తులో ఎం చేస్తున్నామో కూడా తెలియని స్థితికి దిగజారి ప్రమాదాలను కొని తెచుకుంటేనే ముప్పు… అలాంటి సంఘటన ఒకటి తాజాగా ఫ్రాన్స్ లో చోటు చేసుకుంది…

ఆగష్టు 13 వ తేదీ రాత్రి 10 గంటల 40 నిమిషాలకు అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఈఫిల్ టవర్ సందర్శనార్ధం టికెట్స్ కొన్నారు… చూడడానికి అందరిలానే టవర్ ఎక్కారు… ఇంతవరకు అంత బాగానే ఉంది…అయితే సందర్శన సమయం ముగియడంతో భద్రత సిబ్బది పర్యాటకులందరిని కిందకి దింపేశారు…అయితే ఈ ఇద్దరు అమెరికాకు చెందిన పర్యాటకులు మాత్రం భద్రత సిబ్బంది కళ్లుగప్పి పర్యాటకులకు ఎవ్వరికి అనుమతి లేని ఎత్తైన రెండు మూడు లెవెల్స్‌ మధ్య ప్రాంతానికి చేరుకొన్నారు. అయితే అప్పటికే బాగా తాగేసి ఉన్న వాళ్ళు కిందకి రాలేక అక్కడే మద్యం మత్తులో హాయిగా నిద్రపోయారు…

మర్నాడు ఉదయం భద్రతా సిబ్బంది గస్తీ సమయంలో అనుమతిలేని ప్రాంతంలో టూరిస్ట్‌లు నిద్రపోతున్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్‌పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతం నుంచి జాగ్రత్తగా కిందికి దింపినట్టు ఈఫిల్‌ టవర్‌ ఆపరేట్‌ సంస్థ సెటె పేర్కొంది.

అనంతరం వీరిని పారిస్ పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసారు… ఈకారణంగ సోమవారం ఉదయం పర్యాటకుల్ని గంట ఆలస్యంగా ఈఫిల్ టవర్ సందర్శనానికి అనుమతి ఇచ్చారు… ఈఫిల్‌ టవర్‌ను కూల్చివేయడానికి బాంబు అమర్చామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన మర్నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఓ ఆగంతకుడు ఫోన్ చేసి ఈఫిల్ టవర్ కూల్చివేతకు బాంబు అమర్చినట్టు చెప్పడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు…టవర్‌, పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. సందర్శకులను బయటకు పంపారు. బాంబు స్క్యాడ్, జాగిలాలతో గాలింపు చేపట్టారు. ఎటువంటి అనుమానిత వస్తువుల లభ్యం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here