జుట్టు ముడవడమే ఆ యువతి చేసిన తప్పు.. దారుణంగా చంపేసిన ప్రభుత్వం

0
120

మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇరాన్ దేశాన్ని కుదిపేస్తోంది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మహ్స అమినిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడి సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ యువతి జట్టు ముడిచి హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటున్నానని తెలుపుతూ చేసిన ఓ పోస్టు అక్కడ వైరల్ గా మారింది. 23 ఏళ్ల ఇరాన్ యువతి హదీస్ నజాఫీ తను జట్టు ముడుస్తూ.. హిజాబ్ కు వ్యతిరేఖంగా పోరాటంలో పాల్గొంటున్నానని ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఆమెను ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయని తెలుస్తోంది. జర్నలిస్ట్, మహిళా హక్కుల న్యాయమాది మసీష్ అలినేజాద్ సెప్టెంబర్ 25న ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఇరాన్ భద్రతా బలగాలు ఆరుసార్లు ఆమెను కాల్చి చంపినట్లు ఆమె ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే మరో మహిళ తన సోదరుడి అంత్యక్రియల్లో జట్టు కత్తిరించుకున్న మరో ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. నిరసనల్లో ఇప్పటి వరకు 50కి పైగా మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్ భద్రతా బలగాల్లో ఐదో వ్యక్తి మరణించారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. వాయువ్య ఇరాన్‌లోని ఉర్మియా నగరంలో జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన బసిజ్ మరణించినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అశాంతికి కారణం అవతున్న నిరసనకారులపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు.

మహ్సా అమిని చనిపోయి పది రోజులు గుడస్తున్నా.. ఇరాన్ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉంటే గుండె జబ్బులతో మహ్సా అమిని చనిపోయిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇదంతా అబద్దమని తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్యం లేదని ఆమె తండ్రి వెల్లడించారు. మోరాలిటీ పోలీసులే నా కుమార్తెను కొట్టి చంపారని.. కనీసం డెత్ రిపోర్టు కూడా చూడనివ్వలేదని అధికారులపై, ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here