Milk Shake : తాగారా..! మిల్క్ షేక్.. లైఫ్ ఫసక్..

0
22

వేసవి కాలం, శీతాకాలం.. కాలం ఏదైనా కావాల్సిందల్లా మిల్క్ షేక్స్.. ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. అందుకే చిన్న పెద్ద తేడాలేకుండా అందరూ మిల్క్ షేక్స్ ని ఇష్టపడుతుంటారు.. దీనికారణంగానే మిల్క్ షేక్స్ ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.. లేచింది మొదలు పడుకునే వరకు రోజులో ఏదో ఒక సమయంలో మిల్క్ షేక్స్ తాగుతుంటారు చాలామంది.. ఇంకా చెప్పాలంటే రకరకాల మిల్క్ షేక్స్ అందుబాటులోకి వచ్చేసాయి.. గడప దాటాల్సిన అవసరం కూడా లేదు.. డోర్ డెలివరీ కూడా చేస్తారు.. దీనితో కొందరు ఆర్డర్ చేసుకుంటే మరికొందరు సరదాగా అలా బయటకి వెళ్లి తాగుతారు.. ఎలా తాగిన ఫలితం మాత్రం ఒక్కటే.. మిల్క్ షేక్స్ తో ప్రాణాలు కూడా పోవచ్చు అని తాజా పరిశోధనలలో తేలింది.. అబ్బా.. మిల్క్ షేక్ తాగితే ఎక్కడైనా ప్రాణాలు పోతాయా అనుకుంటున్నారా.. పోతాయి అని చెప్తున్నారు నిపుణులు.. వివరాలలోకి వెళ్తే

వాషింగ్టన్‌ లోని టాకోమాలో ఫ్రూగల్స్ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ షేక్స్ వ్రిక్రయిస్తుంటారు.. ఎప్పటిలానే అక్కడ మిల్క్ షేక్స్ తాగిన 6 మంది హాస్పిటల్ పాలయ్యారు.. దీనికి కారణం వాళ్లు తాగిన మిల్క్ షేక్ లో లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉండడమే అని పరిశోధకులు తెలిపారు.. ఈ బ్యాక్టీరియా మిల్క్ షేక్స్ లో ఉండటానికి కారణం అపరిశుభ్రత అని నిపుణులు చెప్తున్నారు..

సాధారణంగా ఈ రెస్టారెంట్ లో మిల్క్ షేక్స్ ని యంత్రాల సహాయంతో తయారు చేస్తారు.. మిల్క్ షేక్స్ తయారు చేసాక సరిగా కడగక పోవడంతో ఆ యంత్రాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల మిల్క్ షేక్స్ లోకి ఈబ్యాక్టీరియా చేరుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.. ఈ బ్యాక్టీరియా చల్లని ఉష్టోగ్రత వద్ద కూడా బ్రతుకుతుందని నిపుణులు చెప్తున్నారు.. ఈబ్యాక్టీరియా చాలా ప్రమాదకరం.. పిల్లలు, గర్భిణీలు, వృధులు ఇలా ఈ బ్యాక్టీరియా తో కలుషితం అయినా మిల్క్ షేక్స్ తాగితే ఆరోగ్యం పైన చెడు ప్రభావం ఎక్కువగా పడుతుందని పరిశోధకులు తెలియచేసారు.. ఈ బ్యాక్టీరియా ఉన్న మిల్క్ షేక్స్ తాగి ఇప్పటికే 6 మంది హాస్పిటల్పాలైనట్లు సాంఘిక మాధ్యమాల సమాచారాం.. మీరు ఇకపైనా ఎప్పుడైనా మిల్క్ షేక్స్ తాగాలంటే ఆలోచించి మంచి రెస్టారెంట్ ని ఎంచుకుని తాగండి.. ప్రశుభ్రత ఆరోగ్యానికి చాల అవసరం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here