ఆకాశంలో “సూపర్ మూన్”.. కనువిందు చేయనున్న అద్భుత దృశ్యం

0
91

ఆకాశంలో అద్భతం చోటు చేసుకోబోతోంది. సాధారణం కన్న పెద్దదిగా మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది. జూలై 13న ‘ సూపర్ మూన్’ ఏర్పడబోతోంది. సాధారణ సమయాల్లో కన్నా 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్న సమయంలో చంద్రుడి కక్ష్య భూమికి దగ్గరగా ( పెరీజీ), దూరంగా (అపోజీ) పాయింట్ వద్దకు వెళ్తుంటుంది. దీంతో కొన్ని సార్లు చంద్రుడు పెద్దదిగా కనిపిస్తాడు.

జూలై 13 తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సూపర్ మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది. ఈ ఏడాది మొత్తం 4 సూపర్ మూన్లు ఏర్పడుతుంటే ఇందులో ఇది మూడోది. నాలుగోది ఆగస్టు 12న కనపించనుంది. సాధారణంగా చంద్రుడు, భూమి మధ్య సగటున 3,84,400 కిలోమీటర్ల ఉంటుంది. జూలై 13న చంద్రుడు భూమికి 3,63,300 కిలోమీటర్ల దూరంలోకి వస్తున్నాడు.

సూపర్ మూన్ భారతదేశ కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ( గురువారం) 12.08 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. వరసగా మూడు రోజుల పాటు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూపర్ మూన్ ను బక్ సూపర్ మూన్, థండర్ మూన్ అని కూడా పిలుస్తారు. సాధారణం కన్నా పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించడంతో దీన్ని సూపర్ మూన్ గా వ్యవహరిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here