ఇండియాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశమే లేదు.. బ్లామ్ బర్గ్ నివేదికలో వెల్లడి

0
80

ప్రపంచ దేశాలు ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలో అనేక దేశాలు నెమ్మదిగా ఆర్థికమాంద్యం స్థితిలోకి వెళుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పాటు అమెరికాను మాంద్యం భయాలు వెన్నాడుతున్నాయి. కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. తాజాగా బ్లూమ్ బర్గ్ ఆర్థికమాంద్యంపై ఓ నివేదికను వెలువరించింది. వీటిలో ప్రపంచంలోనే వివిధ దేశాల్లో ఆర్థికమాంద్యం పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించింది.

భారత్ తో ఆర్థికమాంద్యం వచ్చే పరిస్థితి దాదాపుగా ‘జీరో’ అని.. ఆర్ధికమాంద్యం వచ్చే అవకాశం లేదని వెల్లడించింది. ప్రపంచంలో శ్రీలంకలో 85 శాతం ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఆసియా దేశాల్లో 20-25 శాతం ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని.. యూరోపియన్ దేశాల్లో 50-55 శాతం వరకు ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని.. అమెరికాలో ఆర్థికమాంద్యం 40 శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండోనేషియాలో 3 శాతం, ఫిలిప్పీన్స్ 8 శాతం మాత్రమే ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.

న్యూజీలాండ్ లో 33 శాతం రిసిషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో 25 శాతం వరకు ఛాన్సులు ఉన్నాయని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. చైనా, పాకిస్తాన్ దేశాల్లో 20 శాతం అవకాశాలు ఉన్నట్లుగా బ్లూమ్ బర్గ్ నివేదిక అంచానా వేసింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఆర్థికమాంద్యంతో భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ లో వ్యవసాయ రంగం ముందంజలో ఉందని.. దేశంలో ఆహార కొరత, ఆహార ద్రవ్యోల్బనం లేదని ఆర్థిక నిపుణులు అంచానా వేస్తున్నారు. మాన్యుఫాక్చర్, సర్వీసెస్ సెక్టార్లు కూడా ఇండియాలో బలంగా ఉందని చాలా మంది చెబుతున్నారు. బ్లూమ్ బర్గ్ తో పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) భారత దేశంలో 7.3 శాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here