అందం మనిషికి సంబంధిచినది కాదు మనసుకి సంబంధించింది అనుకునేవాళ్లు కొందరైతే… అందమే సర్వస్వంగా బ్రతికేవాళ్లు ఎందరో…. పైసలుంటే ప్రతి ఒక్కరు అందగాళ్లే అందగత్తెలే… అని బ్యూటీ పార్లర్లు నిరూపిస్తే… కాసులు కురిపిస్తే ప్రతి ఒక్కరు కండలు తిరిగిన వస్తాదులే అని ఫిట్నెస్ సెంటర్లు నిరూపించాయి… ఇంకాస్తా పైస్థాయికి వెళ్తే వయసుని తగ్గించుకునేందుకు సర్జరీలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు… ఆ సర్జరీలు విఫలమై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు… అయితే అందం కోసం రోజుకి వందల కొద్దీ టాబ్లెట్స్ వాడుతూ సంవత్సరానికి కోట్లు ఖర్చుపెట్టే వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు…ఆకోవలోకే వస్తారు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ …
అందం కోసం ఆరాటం… పైబడుతున్న వయసుతో పోరాటం చేస్తూ 45 సంవత్సరాల వయసులో 18 సంవత్సరాల యువకుడిలా మెరుస్తున్నాడు అమెరికా లోని కాలిఫోర్నియా కి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ బ్రియాన్ జాన్సన్.. ఇలా కనిపించడం కోసం ఎంకంగా రోజుకి 111 టాబ్లెట్స్ మింగుతూ సంవత్సరానికి 16 కోట్లు ఖర్చు చేస్తున్నాడు… ఇలా యవ్వనంగ కనిపించేందుకు చికిత్సలో భాగంగా రోజుకి ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నాని బ్రియాన్ జాన్సన్ వివరించారు… ఎంత సంపద ఉంటేనేం…ఎంత యవ్వనంగా కనిపిస్తేనేం ఇంత వయసు వచ్చిన తనకి జీవిత భాగస్వామి మాత్రం దొరకలేదని ఇప్పటికి తాను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని తన బాధని వ్యక్తపరిచారు…ఇంత ఆస్తి పాస్తులు ఉన్న యవ్వనంగా కనిపిస్తున్న తనతో ఏ అమ్మాయి సహజీవనానికి అంగీకరించకపోవడానికి కారణం తను పెట్టిన కండీషన్లే అని వెల్లడించారు… ఎవరైనా అమ్మాయి తనతో సహజీవనానికి అంగీకరిస్తే తను మొదట 10 కండిషన్స్ ఉన్న జాబితాని వాళ్ళ ముందు ఉంచుతానని అది చూడగానే ప్రతి అమ్మాయి తనతో సహజీవనానికి నిరాకరిస్తుందని తెలిపారు…అయితే తనకు నిద్రపోయేటపుడు కాళ్లు, చేతులు ముడుచుకొని పడుకోవడం అలవాటని.. ఎవరితోనైనా డేటింగ్‌కు వెళ్లినపుడు అలా ఉండలేం కదా అని పేర్కొన్నారు…