Bull Dog Ant : చీమలు ప్రాణాంతకం.. వాటితో కుట్టించుకుంటేనే వివాహం

0
34

చీమ సైజు షార్ట్.. కుట్టిందంటే ఆగుతుంది హార్ట్ బీట్.. చాల్లే చెప్పొచ్చారు.. నమ్మేవాళ్ళు ఉంటె ఏనుగు ఏరోప్లేన్ ఎక్కిందని చెప్తారు మీరు.. ఎక్కడైనా చీమలు కుడితే దద్దులు వస్తాయి.. దురద మంట పుడుతుంది.. ఎక్కడైనా ప్రాణాలు పోతాయా? అని అనుకుంటున్నారా కదా..

ఇది నిజం.. ఈ చీమలు కుడితే క్షణాలలో ప్రాణాలు పోతాయి.. కానీ ఆ ప్రాంతాలలో మరో వింత ఆచారం కూడా ఉంది.. మరి ఈ చీమలు ఎక్కడ ఉన్నాయి? వాటి పేరు ఏంటి? ఈ చీమలు ఉన్న ప్రాంతాలలో ఉన్న ఆచారం ఏంటి? అనే ఆసక్తికర విషయాల గురించి ఆలస్యంలేకుండా చూసేద్దామా..

ఆస్ట్రేలియా తీర ప్రాంతం లో కనిపించే ఓ జాతి చీమలు అత్యంత ప్రమాదకరం.. అవి కుడితే కొన్ని క్షణాలలోనే దాని విషం మనిషి ప్రాణాలను తీస్తుంది.. ఆ చీమ వాడుక పేరు తెలియదు.. కానీ ఆ చీమ శాస్త్రీయ నామం (సైంటిఫిక్ నేమ్) “బుల్ డాగ్ యాంట్”.. ఈ చీమ కాటువల్ల 1936 నుండి 1988 వరకు చాలామంది మృతిచెందారు.. కాగా చివరి మరణం 1988లో నమోదైనది.. ఆ తరువాత ఈ చీమ వళ్ళ ఎలాంటి కేసు నమోదు కాలేదు..

Allu Arjun : ఆరోజు తీసుకున్న నిర్ణయం.. ఈ రోజు ఈ స్థాయిలో ఉంచింది.. అల్లుఅర్జున్

ఇక ఈ బులెట్ హైట్, వెయిట్, లైఫ్ గురించి చూస్తే.. 20 మిమీ పొడవు, 0.015 గ్రాములు బరువు ఉన్న ఈ బుజ్జి చీమ 21 రోజులు బ్రతుకుతుంది.. ఇంత బుల్లి చీమ చంపాడానికి సైజు తో పనిలేదు సింపుల్ గా చంపేస్తా అంటూ ఆ ప్రాంతం ప్రజల్ని వణికించింది.. ఇక పోతే పెళ్లిళ్లు కావాలంటే వీటితో కుట్టించుకోవాలనే ఆచారంని కూడా ఆ దేశాల్లో ని కొన్ని తెగల వాళ్లు పాటిస్తారు..

ఇదేం వింత ఆచరమో మరి.. బహుశా ఆ చీమతో కుట్టించుకుని బ్రతికితే భయంలేకుండా అమ్మాయిని ఇస్తారేమో.. ఇలాంటి ఆచారం మనదేశంలో ఉంటె ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో.. దేశంలో సగానికి సంగం మంది బ్రహ్మచారులుగా ఉంటారేమో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here