ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు. డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేయడం చూశాం.. కానీ కాంగోలో ఓ సాంక్చుయరీ నుంచి ఏకంగా మూడు చంపాజీలను కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేశారు కొందరు. సెప్టెంబర్ 9న కటంగా సాంక్చుయరీ నుంచి కిడ్నాప్ చేశారు. ఆ సాంక్చుయరీలో మొత్తం 5 చింపాంజీలు ఉంటే రెండు వంటగదిలో దాక్కోగా..సీజర్, హుస్సేన్, మోంగా అనే మూడింటిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఇలా చింపాంజీలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చని సాంక్చుయరీ వ్యవస్థాపకుడు చాంటెరో అన్నారు.
చింపాంజీలను కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్ల నుంచి ఆడియో, చింపాజీల వీడియో మెసేజ్ లను నాభార్యకు పంపారని చాంటెరో వెలియజేవారు. అయితే హాలిడేస్ లో ఇంటికి వచ్చే మా పిల్లలను కిడ్నాప్ చేయాలని నిందితులు భావించారని.. అయితే వారు రాకపోవడంవతో చింపాజీలను కిడ్నాప్ చేశారని ఆయన అన్నారు. కిడ్నాపర్లు చింపాంజీలకు మత్తు మందు ఇచ్చి.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ఒక వేళ డబ్బులు ఇవ్వకుంటే వీటిని చంపేస్తామని బెదిరిస్తున్నారని చాంటెగో అన్నారు. మా దగ్గర బబ్బులు లేవని.. అర్థం చేసుకోవాలని.. ఒకవేళ మేము డబ్బులు ఇచ్చినా వాటిని తిరిగి ఇచ్చేస్తారనే నమ్మకం లేదని ఆయన అన్నారు.
కిడ్నాపర్ల డిమాండ్లకు లొంగిపోతే.. ఇది మరిన్ని కిడ్నాపులకు దారి తీస్తుందని చాంటెగో అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా ఖండం మొత్తం 23 అభయారణ్యాలు ఉన్నాయని.. ఒక వేళ డబ్బులు ఇస్తే ఇలాగే పలు కిడ్నాపులు జరుగుతాయని అన్నారు. ఈ సంఘటన గురించి కాంగో పర్యావరణ మంత్రి సలహాదారు మిచెల్ కోయక్పా మాట్లాడుతూ.. ఇది అమానవీయమైనదని.. కిడ్నాపర్ల డిమాండ్లకు లొంగిపోమని అన్నారు. అధికారులు కిడ్నాపైన చింపాంజీలను వెతికే పనిలో ఉన్నారు.