ఆపిల్ ఫోన్ ఈ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ ఏ బ్రాండ్ ఫోన్ కి లేదనే చెప్పాలి.. ఆపిల్ ఫోన్ ని స్టేటస్ సింబల్ గా చూసేవాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. ఇక పోతే ఈ ఫోన్ అంతలా ప్రజలని ఆకర్షించడానికి మరో కారణం ఆపిల్ ఫోన్లో ఉన్న సెక్యూరిటీ ఫ్యూచర్స్ అనే చెప్పాలి..
ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు.. కాగా తాజాగా ఈ ఆపిల్ ఫోన్ పైన ఓ దేశం నిషేధం విధించింది.. ఆ దేశం మరేదోకాదు.. మన పొరుగు దేశం చైనా.. వివరాలలోకి వెళ్తే.. చైనా ప్రొడక్ట్స్ కొనాలంటే ఇతర దేశాలు భయపడుతాయి.. కారణం చీప్ గా దొరికే చైనా ప్రోడక్ట్స్ అంతే చీప్ క్వాలిటీతో ఉంటాయి..
ఇంకా చెప్పాలంటే వాళ్ళ దిక్కుమాలినా టెక్నాలజీతో ఇతర దేశాల సాంకేతిక సమాచారాన్ని కూడా దొంగలించగల మేధావులు చైనా ప్రజలు..అందుకే చైనా ప్రొడక్ట్స్ కొనాలంటే భయపడతారు ఇతర దేశ ప్రజలు.. కాగా ఇదే వరుసలోకి చైనా కూడా చేరింది.. భయపెట్టడమే కాదు భయపడడం కూడా తెలుసు అనిపించేలా ఆపిల్ ఫోన్ పైన నిషేధం విధించింది చైనా..
బుధవారం విడుదల చేసిన స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఆపిల్ ఫోన్ తో సహా ఏ ఇతర దేశాల ఫోన్లు వాడకూడదు.. ఒకవేళ ఉద్యోగులు ఆపిల్ తరహా ఇతర దేశాల ఫోన్స్ ని కలిగి ఉన్న వాటిని ప్రభుత్వ కార్య కలాపాలలో వినియోగించకూడదు అని ఉద్యోగులకి సూచించింది..
దీనితో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడం తోపాటుగా.. దేశానికి సంబంధిచిన విలువైన సమాచారం బయటకి వెళ్లకుండా నిరోధించటానికి చైనా చేస్తున్న ప్రయత్నమని విశ్లేషకుల సమాచారం.. కాగా త్వరలో యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న వేళ ఈ నిర్ణయం బయటకు రావడం గమనార్హం..
దీనితో ఆపిల్ కంపెనీకి భారీ నష్టం రాబోతుంది.. ఎందుకంటే ఆపిల్ కంపెనీ ఆదాయం లో 5 వంతుల ఆదాయం చైనా నుండే వస్తుంది.. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.