చైనా దుశ్చర్య.. వంతెనలకు గాల్వాన్ ఘర్షణల్లో చనిపోయినవారి పేర్లు

0
65

భారతదేశం అంటే నిలువెల్ల విషాన్ని నింపుకుంది డ్రాగన్ కంట్రీ చైనా. అదును దొరికితే భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. సరిహద్దుల వద్ద ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. భారతదేశానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లఢాఖ్ ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటోంది. భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తన విస్తరణవాదాన్ని బహిరంగంగా బయటపెడుతోంది. 2020లో గల్వాన్ ఘర్షణలో మన జవాన్లను బలితీసుకుంది చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ. అయితే భారత సైన్యం బలాన్ని తక్కువగా అంచనా వేసిన చైనా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మన సైనికులు, చైనా బలగాలపై విరుచుకుపడి చాలా మందిని చంపేశారు. ఈ విషయాన్ని పాశ్చాత్య మీడియా వెల్లడించినా.. కేవలం ఒకరిద్దరు మరణించినట్టుగా వెల్లడిస్తోంది. స్వదేశంలో తమ సైనికులు భారీగా మరణించారని తెలిస్తే అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై చైనీయులు విశ్వాసం కోల్పోతారని భయపడి ఆ విషయాన్ని వెల్లడించడం లేదు.

ఇదిలా ఉంటే మరోసారి తన భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది డ్రాగన్ కంట్రీ. గల్వాన్ ఘర్షణల్లో చనిపోయిన చైనా జవాన్ల పేర్లను వంతెనలకు పెడుతోంది. నలుగురు సైనికులు పేర్లను జిన్జియాంగ్ ప్రావిన్సు, టిబెట్ లోని వంతెనలకు పెట్టారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. చైనా ప్రజల్లో నానాటికి పెరుగుతన్న దేశభక్తికి నిదర్శనంగా మారిన హీరోలను స్మరించుకునే మార్గమని కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెల్లడించింది. భారత, చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయలో 2020 జూన్ లో జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నాడు. అయితే భారత సైన్యం, అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల సమాచారం ప్రకారం ఈ ఘర్షణల్లో భారతసైనికలు 43 నుంచి 67 మంది చైనా సైనికులను హతమార్చారు.

ఈ ఘర్షణల్లో చనిపోయినట్లు పేర్కొంటున్న చైనా సైనికుల పేర్లను చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జురాన్లుగా అక్కడి ప్రభుత్వం ఫిబ్రవరి 2021లో మాత్రమే వెల్లడించింది. ఈ దాడిలో చనిపోయిన బెటాలియన్ కమాండర్ చెన్ హాంగ్ జున్ కు ‘‘బోర్డర్ డిఫెండింగ్ హీరో’’ అనే బిరుదును కూడా ఇచ్చింది. గాయపడిని సైనిక కమాండర్ క్వి ఫాబావోకు గ్రేట్ హాల్ఆఫ్ పీపుల్ లో ఇటీవల జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 2022 బీజింగ్ లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ క్రీడల ప్రారంభం వేడుకలో క్వి ఫాబావోకు టార్చ్ బేరర్ గా అవకాశం ఇచ్చింది చైనా. ఈ నిర్ణయాన్ని భారత్ వ్యతిరేకించి వేడుకలను బహిష్కరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here