మాల్దీవుల్లో చేజారుతున్న పరిస్థితులు.. ఫోటోలు

0
816

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabya Rajapaksa) దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం తెల్లవారుజామున మాల్దీవులకు పరారయ్యారు. భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్‌తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మేల్‌కు చెక్కేశారు. మరోవైపు మాల్దీవుల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా అక్కడి జనం ఆందోళనలకు దిగుతున్నారు. రాత్రి 11.25 నిమిషాలకు మాల్దీవుల నుండి సింగపూర్ కు వెళ్ళనున్నారు రాజపక్సే.మాల్దీవులు అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ ఇంటి వద్ద లంకా వాసులతో కలసి ఆందోళనకు దిగారు. రోడ్లుపై రాజపక్సే తలదాచుకునే అవకాశం ఇవ్వడంపై బ్యానర్ల ప్రదర్శన నిర్వహించారు. రాజపక్సే ను శ్రీలంకకు వెనక్కి పంపాలంటూ మాల్దీవుల్లో నిరసన వ్యక్తం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here