మూడేళ్లుగా కోవిడ్ వ్యాధి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీని ఎఫెక్ట్ వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల్లో మరణాలు సంభవించాయి. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త అధ్యయనంలో ఎలుకలు కూడా కరోనా వైరస్ సోకవచ్చని తేలింది. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ యొక్క ఓపెన్-యాక్సెస్ జర్నల్ ఎంబయోలో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
న్యూయార్క్ సిటీ ఎలుకలకు కరోనా వైరస్ సంక్రమించవచ్చని అధ్యయనం కనుగొంది. న్యూయార్క్ నగరంలో మొత్తం 8 మిలియన్ల ఎలుకలు ఉన్నాయి. ఇవి ప్రజలతో కాంటాక్ట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. న్యూయార్క్ ఎలుకలు సార్స్ కోవ్-2 యొక్క ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు పాజిటివ్ గా పరీక్షించబడ్డాయి. మొత్తం 79 ఎలుకల్లో 13 (16.5 శాతం) ఎలుకలకు కరోనా సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎలుకలకు కరోనా సోకుతుందని నిరూపించిన తొలి ప్రయోగం ఇదే అని అన్నారు.
అయితే, కోవిడ్ సోకిన ఎలుకలకు ఎలా కరోనా సోకింది..? ఇది మానవులకు ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ వైరస్ ఎలుకల్లో కొత్త వేరియంట్ల పరిణామం చెందుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుంనది డాక్టర్ వాన్ చెప్పారు. మానవులను ప్రభావితం చేసే మహమ్మారిలో జంతువుల పాత్రను పోషిస్తాయని ఈ ప్రయోగం చూపిస్తుందని పరిశోధకలు చెప్పారు.
అయితే ఇప్పటి వరకు కోవిడ్-19 కారణమయ్యే కరోనా వైరస్ ప్రజలకు సోకడంతో జంతువులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని ఎలాంటి ఆధారాలు లేవు. అయితే గబ్బిలాల వంటి క్షీరదాల వల్ల ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందుతుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఇది అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. దీనికి ముందు హాకాంగ్, బెల్జియంలో ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో అవి వైరస్ ఇన్ఫెక్షన్లకు గుైనట్లు కనుగొన్నారు.