Media Organisations: పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు..

0
119

Delhi: ప్రపంచం లో ఏ మూల ఏం జరిగిన క్షణాలలో ప్రజలకి తెలియచేస్తుంది మీడియా. తప్పు చేస్తే ప్రశ్నిస్తుంది. ప్రతిభ చూపితే ప్రసంశిస్తుంది. ప్రతిక్షణం ప్రజల కోసమే పని చేస్తుంది మీడియా. ప్రజాహితం కోసం పోరాడే మీడియాలో అనుక్షణం భయపడుతూ పనిచేయాల్సి వస్తుందని.. పత్రిక స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది.. 15 మీడియా సంస్థలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశాయి. ఈ లేఖలో దేశంలోని దర్యాప్తు సంస్థలు జర్నలిస్టులను విచారించేందుకు మరియు వారి నుంచి ముఖ్యమైన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటివి వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక విధానాలను రూపొందించాలని..చట్టానికి ఎవరు అతీతులు కారని.. పాత్రికేయులు కూడా చట్టాన్ని అనుసరించాలని.. చట్టాన్ని అతిక్రమించాలని మేము కూడా కోరుకోవడంలేదని.. కానీ, పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే సమాజంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు పత్రికపాత్రికేయులుగా ఎప్పుడు మేము ముందే ఉంటాం అని సీజేఐకి రాసిన లేఖలో ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

Read also:

ఈ సందర్భంలో పలు మీడియా సంస్థలు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాయి. దేశం లోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ. మాపైన ఆయుధాలతో దాడి చేస్తున్నారని.. పత్రిక పాత్రికేయలు ఏ క్షణం ఎవరు ఏ ప్రతీకార దాడిలో ప్రాణాలను తీస్తారో అనే భయంతో పనిచేస్తున్నారని ఆరోపించాయి. కాగా ఈ మధ్యన న్యూస్‌క్లిక్‌ లో పనిచేసే 46 మంది ఆన్‌లైన్‌ రీపోటర్ల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన ప్రబీర్‌ పుర్కాయస్తా అంశాన్ని కూడా లేఖలో పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here