అమెరికాలో 2024 లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నకల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు అక్కడి పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ప్రచార కార్యాక్రమాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రస్తావించిన ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్ళీ గెలిస్తే ముస్లిం దేశాల పౌరుల రాకపోకలపైన నిషేధాన్ని విధిస్తానని పేర్కొన్నారు. గతంలో తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముస్లిం పౌరలును అమెరికాలో అడుగుపెట్టనివ్వలేదని.. అందుకే తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. దేశం లోకి ప్రవేశించి బాంబు దాడులు చేసే వ్యక్తులు దేశం లోకి రావాలని కోరుకోకూడదు అని వెల్లడించారు.
Read also:Ram Gopal Varma: చూడు బేబీ.. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.. రాంగోపాల్ వర్మ
గతంలో ఇరాన్, ,ఇరాక్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, సూడాన్ వంటి పలు దేశాల పౌరులు అమెరికా లోకి ప్రవేశించకుండ ట్రంప్ ఆంక్షలు విధించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను శ్వేతసౌధం విమర్శించింది. ఇస్లామోఫోబియాతో వివక్షత చూపడం తప్పని.. అందుకు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ చర్యలు తీసుకున్నారని.. ఇక పైన కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తారని శ్వేతసౌధం ప్రకటించింది. కాగా ట్రంప్ వ్యాఖ్యలకు నిక్కీహేలీ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు. లాస్‌వెగాస్‌లో నిర్వహించిన యూదు రిపబ్లికన్ల సమావేశంలో నిక్కీహేలీ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి అధ్యక్షునిగా పదవిని కైవసం చేసుకుంటే ఆ నాలుగు సంవత్సరాలు కక్ష సాధింపులు, నాటకాలతో దేశం గందరగోళం అవుతుందని ఆరోపించారు. అది అమెరికాకు పెనుప్రమాదం అని హెచ్చరించారు.