ట్విట్టర్ కు అంతా తానే.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించిన ఎలాన్ మస్క్

0
127

ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ట్విట్టర్ టేకోవర్ తరువాత కీలక పదవుల్లో ఉన్న నలుగురు ఉద్యోగులను పీకేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు చేశారు. తానే ఏకైక డైరెక్టర్ గా కొనసాగనున్నారు. నవంబర్ 1కి ముందు కంపెనీలో భారీ తొలగింపులు ఉంటాయని వచ్చిన వార్తలను తిరస్కరించిన కొన్ని గంటల్లోనే బోర్డును రద్దు చేశారు. 9 మంది డైరెక్టర్లను తొలగించారు.

ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యకు తీసుకున్నారు. ట్విట్టర్ ను పూర్తిగా కమర్షియల్ గా మార్చేందుకు మస్క్ సిద్ధం అయ్యారు. ట్విట్టర్ లో పెయిడ్ వెర్షన్ తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యారు. నెలవారీ బ్లూటిక్ సహా.. అదనపు ఫీచర్ల సబ్స్ స్క్రిప్షన్ల ధరను 19.99 డాలర్లకు పెంచాలని ఆలోచిస్తున్నట్లు సమచారం. కంపెనీ ఆదాయంలో సగం సబ్స్ స్క్రిప్షన్ల ద్వారానే సంపాదించాలని భావిస్తున్నారు. నవంబర్ 7 కల్లా దీనిపై కసరత్తు చేయాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు ట్విట్టర్ లో ఉద్యోగుల కోతకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఏకంగా 75 శాతం ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయగద్దెతో సహా పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్యను 7,500 నుంచి 2000 లకు తగ్గించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇండియాకు చెందిన శ్రీరామ్ కృష్ణన్, ఎలాన్ మస్క్ కు సహాయం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ ను తీసేసిన మస్క్, మరో ఇండియన్ సహాయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శ్రీరామ్ ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ పై పట్టుబిగిస్తున్న మస్క్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేదానిపై ప్రపంచం మొత్తం చర్చ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here