పాకిస్తాన్ లో హిందూ మహిళకు కీలక పోస్టు.. తొలి మహిళగా రికార్డ్

0
118

పాకిస్తాన్ దేశంలో ఓ హిందువు కీలక స్థానంలో ఉండటం అనేది చాలా అరుదు. ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఉన్న పాకిస్తాన్ లో మైనారిటీలకు హక్కులు శూన్యం. నిత్యం హిందువులను మతం మార్చడం.. వినకపోతే వారి అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి వివాహాలు చేసుకోవడం అక్కడ సాధారణంగా మారాయి. పదుల శాతంలో ఉన్న హిందువుల జనభా ప్రస్తుతం ఆ దేశంలో కేవలం 2 శాతానికి చేరింది. కానీ ఓ మహిళ మాత్రం రికార్డులు తిరగరాసింది. పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంటత్ పదవిని అందుకుంది. పాకిస్తాన్ కు చెందిన హిందూ మహిల మనీషా రోపెటా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా రోపేటా తండ్రి వ్యాపారం చేసేవారు. ఆమె 13వ ఏట తండ్రి మరణించడంతో.. తల్లి కరాచీకి తీసుకువచ్చి పిల్లలను పెంచించింది. సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ నిర్వహిచిన పరీక్ష్లలో 468 మంది అభ్యర్థుల్లో 16వ స్థానంలో నిలిచిన మనీషా రోపేటా డిఎస్పీ స్థానాన్ని అధిరోహించింది. ప్రస్తుతం మనీషా, నేరాలు అధికంగా ఉండే లియారీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.

26 ఏళ్ల మనీషా రోపేట మాత్రం హిందువులకే కాకుండా మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుంచి పితృస్వామ్య వ్యవస్థను చూశానని.. పాకిస్తాన్ లో అమ్మాయిలు చదువుకోవడం అంటే డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని.. మనీషా రోపేటా అన్నారు. సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనీషా.. పోలీస్ వంటి శాఖల్లో కూడా మహిళా ప్రాతినిథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీస్ శాఖలో చేరినట్లు వెల్లడించారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతున్నారని.. వారికి అండగా నిలబడాలనే పోలీస్ ఉద్యోగం సంపాదించానని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here