దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి

0
186

దుండగుల కాల్పుల్లో జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నారా సిటీలో ఓ బహిరంగ సభలో షింజో ప్రసంగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జపాన్ మాజీ ప్రధాని షింజే మృతి చెందినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ వెంటనే ఆయన వేదిక మీదే కుప్పకూలిపోయారు.
నారా సిటీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో షింజే అబే ప్రసంగిస్తున్న సమయంలో వెనుకనుండి ఓ దుండగుడు కాల్పులు జరిపాడని స్థానిక మీడియా తెలిపింది. మాజీ ప్రధాని షింజే అబేపై కాల్పులకు దిగిన దుండగుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని మీడియా వివరించింది. ఆదివారం నాడు జపాన్ లో ఎగువ సభ ఎన్నికలను పురస్కరించుకొని స్టంప్ ప్రసంగం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్టుగా క్యోడో వార్తా సంస్థ తెలిపింది.

“జపాన్ మాజీ ప్రధాని షింజో వెస్టరన్ జపాన్‌లోని నారా సిటీలో ఓ సభలో ప్రసంగిస్తుండగా కుప్పకూలారు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం.. గాయమైనట్లు తెలుస్తుంది. గన్ షాట్ లాంటి శబ్దం వినిపించింది. ఆ తర్వాత కిందపడిన అతనికి రక్తం కారుతుంది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు” అని ఎన్​హెచ్​కే రిపోర్టర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here