ప్రస్తుతం యావత్ ప్రపంచం ద్రుష్టి భారత్ వైపే ఉంది.. దీనికి కారణం సాంకేతిక రంగంలో భారత్ సాధించిన పురోగాభివృధే.. తాజాగా చంద్రయాన్ ౩ చంద్రుని దక్షణ ధ్రువం పైన మృదువుగా దిగింది.. దీనితో చంద్రుని దక్షణ ధ్రువం పైకి చేరుకున్న తొలి దేశంగా భారత్ కీర్తి గణించింది..
భారత్ సాధించిన ఈ విజయానికి యావత్ ప్రపంచం ప్రశంసల జల్లును కురిపిస్తుంది.. ఈ నేపథ్యంలోనే మన దాయాధి దేశం పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా చంద్రుని ల్యాండింగ్‌ను ప్రశంసించారు. ఈయన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రి గా పనిచేశారు..
కాగా తాజాగా తన ట్విటర్ ఆయన ఇలా రాసుకొచ్చాడు. “చంద్రయాన్ 3 ద్వారా చంద్రునిపైకి అడుగుపెట్టిన ఇస్రోకు ఇది ఎంతో గొప్ప క్షణం. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తో యువశాస్త్రవేత్తలు ఈ క్షణాన్ని ఆస్వాదించడం చూడగలిగాను. కలలు ఉన్న యువతరం మాత్రమే ప్రపంచాన్ని మార్చగలదు.” అని పాక్ మాజీ మంత్రి పేర్కొన్నారు..
అంతకుముందు చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్తాన్ మీడియా ప్రసారం చేయాలని కూడా ఆయన సూచించారు. ఈ మిషన్‌ను “మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం” అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. గతంలో ట్విటర్ వేదికగా చేసిన పోస్ట్‌లో.. పాక్ మీడియా రేపు సాయంత్రం 6.15 గంటలకు చంద్రయాన్ చంద్రుని ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూపించాలని కోరారు. మానవజాతికి ముఖ్యంగా ప్రజలకు, శాస్త్రవేత్తలకు, భారత అంతరిక్ష సంఘానికి చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు.