Elon Musk: ప్రపంచవ్యాప్తంగా భారతీయుల హవా..! ఎలాన్ మస్క్ వాక్యాలు

0
99

ఎవరు దోచుకోలేని ధనం విజ్ఞానం.. భారత దేశ సంపదని ఎందరో దోచుకున్నారు.. సుసంపన్నమైన భారత దేశాన్ని పేద దేశంగా మార్చారు.. ఇప్పుడిప్పుడే భారత దేశం అభివృద్ధి చెందుతుంది.. భారత్ పైన ఎవరు దండెత్తి వచ్చిన సంపదను అయితే దోచుకోగలిగారు కానీ మేధస్సుని దోచుకోలేక పోయారు.. అందుకే అంటారు ఎవరు దోచుకోలేని ధనం విజ్ఞానం అని.. భారత్ లో పుట్టి ఇక్కడ ఉంటూ విదేశాలు అభివృద్ధి గురించి భజన చేసేవాళ్లు కొందరు ఉన్నారు.. కానీ ప్రపంచంలో భారతీయుడు లేకుండా అభివృద్ధి చెందిన దేశం ఒక్కటికూడా లేదు.. ప్రపంచవ్యాప్తంగా విజయభేరిని మోగిస్తున్న సంస్థలలో భారతీయులు ఉన్నత పదవులలో ఉండి ఆ సంస్థల్ని విజయపధంలో నడిపిస్తున్నారు.. ఈ మాట అన్నది భారతీయులు కాదు.. సాక్షాత్తు విదేశీయుడైన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్..

భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలలో సీఈవోలుగా ఇతర ఉన్నత పదవులలో ఉన్నారు.. ధీపైన ప్రపంచ కుబేరులలో ఒకరైన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. అనేక టెక్, నాన్-టెక్ కంపెనీలలో ఉన్నత స్థానాలను కలిగి ఉన్నారు భారత సంతతికి చెందిన వ్యక్తులు.. అంతే కాదు ఏ సంస్థలో భారతీయులు సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నారో ఆ సంస్థలు దీర్ఘ కాలం విజయపధంలో ఉన్నాయి..

అలాంటి సంస్థలలో సుందర్ పిచాయ్ తలపెట్టిన ఆల్ఫాబెట్ కూడా ఒకటి.. మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, అడోబ్ కూడా ఈ జాబితాలో లోకి వస్తాయి.. సత్య నాదెళ్ల, నీల్ మోహన్, శాంతను నారాయణ్ టెక్ దిగ్గజాలకు నాయకత్వం వహిస్తున్నారు.. ప్రపంచ బ్యాంక్ కు 14వ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా కూడా ఈ జాబితాలో ఉన్నారు.. ఇలా ఒక్కటేంటి స్టార్‌బక్స్, కాగ్నిజెంట్, మైక్రోన్ టెక్నాలజీ చీఫ్‌లు లక్ష్మణ్ నరసింహన్, రవి కుమార్ ఎస్, సంజయ్ మెహ్రోత్రా,ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చానెల్ యొక్క గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లీనా నాయర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంతతి కార్పొరేట్ బాస్‌ల ర్యాంక్‌లలో కూడా ఉన్నారు అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here