gunfound:స్కూల్ బ్యాగ్ లో పెట్టాల్సింది పెన్ మచ్చా.. గన్ కాదు

0
38

స్వచమైన నవ్వులకి నిలువెత్తు రూపం చిన్నారులు.. కల్మషం లేని వ్యక్తిత్వం.. లోకంతెలియని మనస్తత్వం పసిపిల్లలది.. అందుకే ప్రతిఒక్కరు చిన్నపిల్లలని ఇష్టపడుతుంటారు..ఇంకా వాళ్ళ తల్లి దండ్రుండ్రులు పిల్లలగురించి తీసుకునే కేరింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు..

ముక్యంగా వాళ్ళ భవిష్యత్ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తుంటారు.. అయితే పెద్దల తీరుని బట్టే పిల్లల నడవడిక ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.. అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు చాల జాగ్రత్తగ ఆచితూచి మాట్లాడుతుంటారు.. మంచి నడవడికని పెంపొందించడానికి పిల్లలు చదివే పాఠశాలని కూడా ఎంతో జాగ్రతగా ఎంచుకుంటారు..

ఇంక పిల్లలని పాఠశాలకి పంపేటప్పుడు కూడా వాళ్ళకి కావలసినవన్నీ జాగ్రతగా సర్దుతారు.. స్నాక్స్, లంచ్ బాక్స్, బుక్స్, పెన్స్ మొదలైనవి సర్దుతారు.. కాని ఈ తండ్రి మాత్రం పుస్తాకాలు పెన్నులు పెట్టాల్సిన స్కూల్ బ్యాగ్ లో గన్ పెట్టి స్కూల్ కి పంపాడు.. అంతర్జాతీయ మీడియా నివేధిక ప్రకారం.. అమెరికాలో శాన్ ఆంటోనియోలోని ప్రీ-కె 4 SA సెంటర్‌లో ఒక ఉపాధ్యాయుడు ప్రీ కేజి విద్యార్ధి స్కూల్‌బ్యాగ్‌లో హ్యాండ్‌గన్‌ని గమనించి షాక్‌కు గుర్రైనట్లు తెలుస్తుంది..

పాఠశాల నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం.. అమెరికాలో శాన్ ఆంటోనియోలోని ప్రీ-కె 4 SA సెంటర్‌లో ౩ ఏళ్ళ చిన్నారి చదువుకుంటుంది.. ఎప్పటిలానే ఆరోజు కూడా పాప స్కూల్ కి వచ్చింది.. ఆ స్కూల్ లోని ఉపాధాయుడు ఎప్పటిలానే తన స్కూల్ బ్యాగ్ నుండి పాఠ్యపుస్తకాన్ని తియ్యడానికి బ్యాగ్ ని ఓపెన్ చెయ్యగా అందులో తుపాకి ఉండడం గమనించారు ఆ ఉపాధ్యుడు..

ఐతే ఈ విషయం ఆ పాపకి కూడా తెలియదు..వెంటనే గన్ తో సహా పాప బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్న ఉపాధ్యాయుడు ఈ విషయం గురించి స్కూల్ అధికారులకి తెలియచెయ్యగ పోలీసులకి సమాచారం ఇచ్చారు అనిపాఠశాల సీఈవో సారా బరే తెలిపారు…

అనంతరం రంగ ప్రవేశం చేసిన శాన్ ఆంటోనియో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ చిన్నారి తండ్రి 35 ఏళ్ల పీట్ రోబుల్స్ ని అరెస్టు చేసి.. “చిన్నారిని చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్‌తో రక్షిత కస్టడీలో ఉంచినట్లు.. విచారణ వేగంగా కొనసాగుతోంది.” అని పోలీసులు తెలిపినట్లు.. అంతర్జాతీయ మీడియా సమాచారం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here