యూకేలో హిందూ ఆలయంపై దాడి.. ఖండించిన భారత్

0
70

భారత్, పాకిస్తాన్ ల మధ్య ఆగస్టు 28న జరిగిన క్రికెట్ మ్యాచ్ తరువాత నుంచి బ్రిటన్ లోని లీసెస్టర్ నగరంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు దేశాలకు చెందిన మద్దతుదారులు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో హింస చెలరేగుతోంది. ఇప్పటికే పోలీసు అధికారులు ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరారు. ఇదిలా ఉంటే లీసెస్టర్ లోని ఓ హిందూ దేవాలయంపై గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనను లండన్‌లోని భారత హైకమిషన్ హింసాకాండపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దాడిని ఖండించింది. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరింది.

ఈస్ట్ లీసెస్టర్ లోని హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి.. బయట ఉన్న కాషాయజెండాను గుర్తు తెలియని వ్యక్తుల పడేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. యూకే పోలీసులు ఉండగానే.. దుండగులు ఆలయాన్ని టార్గెట్ చేశారు. ఓ వ్యక్తి కాషాయ జెండాను లాగుతూ.. అక్కడ ఉన్న గుంపును ప్రేరేపించాడు.

ఆగస్టు 28న దుబాయ్‌లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ తర్వాత లీసెస్టర్‌లో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల చెలరేగాయి. రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హిందూ ఆలయంపై దాడుల అనంతరం నుంచి మరింతగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ దాడులకు పాల్పడిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. బాధిత ప్రజలకు రక్షణ కల్పించాలని భారత హైకమిషన్ సోమవారం ఓ ప్రకటనలో కోరింది. లీసెస్టర్ సిటీలో ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయి.

లీసెస్టర్ షైర్ హింసలో పాల్గొన్నవారిలో 47 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. స్థానిక రాడికల్ ఇస్లాంవాదులు, హిందువుల ఇళ్లను, వాహనాలను టార్గెట్ చేస్తూ.. దాడులు చేస్తున్నారు. నాటింగ్‌హామ్, బర్మింగ్‌హామ్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here