పాకిస్తాన్ లో హిందూ మహిళ దారుణహత్య.. తల నరికి, చర్మ ఒలిచి అరాచకం

0
455

పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులకు, సిక్కులకు రక్షణ లేదనే విషయం మరోసారి తేటతెల్లం అయింది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో హిందూ బాలికలను, మహిళలను అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా మానవహక్కుల గురించి, మైనారిటీల రక్షణ గురించి నిత్యం భారత్ పై ఏడుస్తుంది. భారత్ తో మైనారిటీలకు రక్షణ లేదని అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతోంది.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళను అత్యంత పాశవికంగా హత్య చేశారు. సింజోరోలో హిందూ మహిళ తల నరికి, చర్మ ఒలిచి హత్య చేసినట్లు పాక్ ప్రజాప్రతినిధి కృష్ణకుమారి వెల్లడించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పాకిస్తాన్ తొలి హిందూ మహిళా సెనెటర్ కృష్ణకుమారి సందర్శించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బాధితురాలి శరీరం నుంచి తలను నరికేసి, చర్మాన్ని ఒలిచి, రొమ్ములను కత్తిరించి అత్యంత దారుణంగా హత్య చేశారని.. 40 ఏళ్ల దయా భెల్ అనే మహిళ మృతదేహం అత్యంత దారుణమైన స్థితిలో కనిపించిందని కృష్ణకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన జియాలా అమర్ లాల్ భీల్ మొదటగా తన వ్యవసాయ క్షేత్రంలో మృతదేహాన్ని గుర్తించారు. మహిళ కుటుంబీకుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. మృతిరాలికి నలుగురు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి తరుపరి విచారణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here