అక్కడ మహిళలు ప్రకటనల్లో నటించడం నిషేధం

0
19

మతచాంధసవాదంతో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. మహిళలను ఇప్పటికీ పిల్లలు కనే ఓ యంత్రంగానే చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో మహిళలు చదువుకోవడం, ఉద్యోగం చేయడంపై కూడా నిషేధం ఉంది. ఇక ఇరాన్, ఇరాక్, ఖతార్, కువైట్, సౌదీ, లిబియా వంటి దేశాల్లో కూడా మహిళ హక్కులపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. అయితే సౌదీ, యూఏఈ వంటి దేశాలు ఇప్పుడిప్పుడే మహిళలకు హక్కులను కల్పిస్తున్నాయి. ఇక హిజాబ్ వంటి సంప్రదాయాలను మహిళలు ఖచ్చితంగా పాటించాలనే నియమం ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై నిషేధం విధించింది. ఇటీవల హిజాబ్ లో ఉన్న యువతి మాగ్నమ్ ఐస్ క్రీమ్ కొరుకుతున్నట్లు చూపుతున్న యాడ్ దేశంలో వివాదానికి కారణం అయింది. దీంతో ఇరాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్ మత శాఖ ఇకపై అన్ని రకాల వాణిజ్య ప్రకటనలలో మహిళలను నటించడంపై నిషేధాన్ని విధించింది. ఇదిలా ఉంటే ఈ ఐస్ క్రీమ్ యాడ్ చేసిన డోమినో కంపెనీపై కేసులు పెట్టాలని ఇరాన్ లోని మతగురువులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల విలువలకు అవమానంగా ఈ యాడ్ ఉందని అక్కడి మతగురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన లోని అన్ని థియేటర్స్, యాడ్ ఎజెన్సీలకు లేఖలు రాసింది అక్కడి ప్రభుత్వం. హిజాబ్, మత పవిత్రత నియమాలను ధిక్కరిస్తున్న నేపథ్యంలో మహిళలు ఇకపై ప్రకటనల్లో నటించడానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసింది. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత అయతొల్లా రుహెల్లా ఖోమేనీ మహిళలు చాదర్ ధరించాలని ఆదేశించారు. అప్పటి నుంచి ఇరాక్ మహిళలకు ఇది తప్పనిసరి అయింది. గత రెండు ఏళ్లలో దేశంలో హిజాబ్ ధరించడాన్ని ధిక్కరించిన ఇరాన్ మహిళలను అక్కడి ప్రభుత్వం నిర్భంధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here