హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు ఇరాన్ కీలక నిర్ణయం..

0
115

ఇరాన్ దేశంలో ముస్లిం మతాచారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. ముఖ్యంగా హిజాబ్ అంశంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది మహ్సా అమిని అనే మహిళ హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరువాత ఆ అమ్మాయి చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, యువత ప్రభుత్వానికి, హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. మహిళలు హిజాబ్ తీసివేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఆందోళనలు తగ్గిపోవడంతో హిజాబ్ పట్ల కఠినంగా వ్యవహరించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ జట్టును హిజాబ్ తో కప్పుకోవాలి. అయితే దీన్ని పకడ్భందీగా అమలు చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. హిజాబ్ ధరించని మహిళలను గుర్తించి శిక్షలు, జరిమానాలు విధిస్తామని అక్కడి అధికారులు శనివారం ప్రకటించారు. హిజాబ్ ఉల్లంఘించిన వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.

హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని నిరోధించాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. హిజాబ్ ఉల్లంఘన దేశ ఆధ్యాత్మిక ప్రతిష్టను దెబ్బతీస్తుందని అక్కడి న్యాయవ్యవస్థ, ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఇరాన్ లోని మాల్స్, రెస్టారెంట్స్, దుకాణాల్లో హిజాబ్ డ్రెస్ కోడ్ ధిక్కరించిన వారిని అరెస్ట్ చేస్తోంది. 1979 విప్లవం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తోంది. దీంట్లో భాగంగా అప్పటి నుంచి 7 ఏళ్లు దాటిని అమ్మాయిలు, మహిళలు తప్పకుండా హిజాబ్ ధరించాలనే చట్టాన్ని చేసింది. ఇటీవల హిజాబ్ లేకుండా దుకాణానికి వచ్చిన ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి పెరుగుతో దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here