స్కర్టు వేసుకుందని అమ్మాయిని చితక్కొట్టిన మగాళ్లు

0
257

ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత ఆటవికంగా ఉంటాయో ప్రత్యేకం చెప్పనవసరం లేదు. ఇరాక్, ఇరాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మహిళల హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆడవాళ్లు కేవలం పిల్లలు కనడానికి, వంట చేయడానికి మాత్రమే పరిమితం. హిజాబ్ ను కాదని.. వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటే అంతే సంగతులు. చట్టం శిక్షించడమో లేకపోతే ఇస్లాం మతోన్మాదులు దాడులు చేయడమో అక్కడ పరిపాటి. అయితే సరిగ్గా ఇలాంటి ఘటనే ఇరాక్ లో జరిగింది.

టాప్, స్కర్టు ధరించిన ఓ 17 ఏళ్ల అమ్మాయిని 16 మంది వ్యక్తులు వెంబడించి మరీ దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇరాక్ లో మోటార్ సైకిల్ రేస్ చూసేందుకు వచ్చిన అమ్మాయిని అక్కడ ఉన్న గుంపు అసభ్యంగా దుస్తులు ధరించిందని చెబుతూ దారుణంగా కొట్టారు. అమ్మాయి వెళ్లిపోతున్నా వెంబడించి మరీ దాడి చేశారు. కొంతమంది ఈ దాడిని మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు. ఈ సంఘటన డిసెంబర్ 30, 2022లో జరిగింది. ఇరాక్ లోని కుర్దిస్థాన్ ప్రాంతంలో బైక్ రేసింగ్ ఈవెంట్ లో ఈ ఘటన జరిగింది. అయితే పోటీలో పాల్గొంటున్న మగవాళ్ల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి డ్రెస్ వేసుకువచ్చిందంటూ దాడిలో పాల్గొన్నవారు ఆరోపిస్తున్నారు.

ఈ దాడిని నుంచి అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి, కత్తితో పొడిచారు. మగవారు ఆ అమ్మాయిని చుట్టుముట్టి అరవడం వీడియోలో చూడవచ్చు. బైకర్లు అమ్మాయిన చుట్టుముట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దాడిలో పాల్గొన్న 16 మందిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కొడవళ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here