పూరిగుడిసైన అది సొంతదైతే చాలు అనుకుంటారు చాలామంది.. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్న ప్రశాంతత ఎక్కడ ఉండదు.. నెల వచ్చేసరికి కిరాయికి అవస్థలు పడాల్సిన పనిలేదు.. ఇంట్లో ఏదైనా పాడైతే సంచాయిషి చెప్పాల్సిన అవసరంలేదు.. ఎలాంటి ఆంక్షలు ఉండవు..నచ్చినట్టు ఉండొచ్చు.. అందుకే చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక కల.. ఆ కలని సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. ఇప్పుడు బ్యాంకులు కూడా లోన్ రూపంలో ఆర్ధిక సహాయం చేస్తున్నాయి.. దీనితో మధ్యతరగతి వాళ్ళు కూడా ఇల్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.. కానీ కొందరు సంపన్నులు మాత్రం అద్దె ఇల్లలో ఉండడానికే మక్కువ చూపుతున్నారు.. ఈ కోవలోకే వస్తారు అమెజాన్ ఫౌండర్ “జెఫ్ బెజోస్”..
జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేర్లలో ఒకరు.. ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జెఫ్ బెజోస్ తనకి కాబోయే అర్ధాంగితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడని సాంఘిక మాధ్యమాల సమాచారం..హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీకి చెందిన ఈ భవనం 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఇన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది.. రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్, గార్డెన్స్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలతో విలాసవైంతమైన ఈ భవనం అద్దె కూడా అంతే స్థాయిలో ఉంది..
నెలకి 600000 డాలర్లు అద్దెగా చెల్లిస్తున్నారు జెఫ్ బెజోస్ అని సోషల్ మీడియా వేదికగ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..అయితే బెజోస్ స్వంత బెవర్లీ హిల్స్ ఆస్తి పునర్నిర్మాణంలో ఉంది. అందుకే ఇక్కడ అద్దెకు దిగినట్టుగా తెలుస్తోంది.. అతను చెల్లించే అద్దె మన ఇండియన్ కరెన్సీ లో సాక్షాత్తు 5 కోట్లు అని తెలుస్తుంది..ఈ డబ్బులకి మన హైద్రాబాదు సిటీ అవుట్ స్కట్స్ కి వెళ్ళితే దాదాపు 10 ఇళ్ళని కొనవచ్చు..