Kenya Power Outage: అంధకారంలో కెన్యా.. అసలేమైంది?

0
32

మనిషికి పంచభూతాలలో రెండు భూతాలు చాల అవసరం.. ఒకటి నీరు, రెండు వెలుగు.. వెలుగంటే మళ్ళీ సూర్య కాంతి కాదు కరెంట్.. నీరు లేకుంటే కనీసం వారమైన బ్రతకగలరు.. కానీ కరెంట్ లేకపోతే క్షణంమో యుగంలా ఉంటుంది నేటి ఆధునిక మనిషికి.. సుఖానికి అలవాటు పడిన మనిషికి నిద్రలేచినప్పటి నుండి మొబైల్ ఉండాలి.. కడుపులో ఇంత ముద్ద పడాలి అంటే ఇంట్లో వంటకి ఉపయోగించే యంత్రాలన్నీ విద్యుత్ శక్తీ తోనే పనిచేస్తాయి.. కనీసం నిద్రపోవడానికి కూడా ఫ్యాన్, A /c ఉండాలి..

వేసవిలో అయితే కరెంట్ కోత్త ఎక్కువగా ఉంటుంది.. మనదేశంలో కాసేపు కరెంట్ పోతేనే మనం కరెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ.. కరెంట్ కట్ చేసిన వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటాం.. అలాంటిది వేడి అధికంగా ఉండే ప్రాంతంలో కరెంట్ పోతే..? అది కూడా గంటల వ్యవధిలో ఉంటె? ఆ ప్రాంత వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది.. కానీ కెన్యా ప్రజలే కాదు పాలకులు కూడా కరెంట్ కోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. గంటల కొద్దీ అంధకారంలో మగ్గిపోతున్నారు..

కెన్యా దేశం ఆఫ్రికా ఖండం లో ఉంది.. ఆఫ్రికా ఖండం భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుంది.. దీనివల్ల అక్కడ వేడి తీవ్రత అధికంగా ఉంటుంది.. మన దేశంలో వేసవిలో ఉండే ఉష్ణగ్రత కెన్యా దేశంలో మామూలు రోజుల్లో రాత్రి సమయం ఉండే ఉష్ణోగ్రతకి సమానంగా ఉంటుంది.. దీన్ని బట్టి అంచనావేయొచ్చు అక్కడ వేడి తీవ్రత ఎలా ఉంటుందో.. అయితే ప్రస్తుతం కెన్యా తీవ్ర విద్యుత్ సమస్యని ఎదురుకుంటుంది..

కెన్యాలో శుక్రవారం రాత్రి విద్యుత్ నిలిచిపోయింది.. అది ఒకటి రెండు గంటలు కాదు.. ఏకంగా 14 గంటలు కరెంట్ లేదు.. దీనితో ఆ దేశ పౌరులు ఆ రాత్రంతా అంధకారంలోనే గాపాల్సి వచ్చింది.. కెన్యా రాజధాని నైరోబీ లోను ఇదే పరిస్థితి.. దీనితో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా గంటల తరబడి మూసివేశారు. ఆస్పత్రులు, ఆఫీసులు, ఇలా ఒక్క చోటేంటి కెన్యాలో అన్ని చోట్ల తుదకు దేశాధ్యక్ష కార్యాలయ ప్రాంగణానికి కూడా విద్యుత్ కష్టాలు తప్పలేదు.

అయితే విద్యుత్ కోతపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి వివరణ లేదు.. కెన్యా రవాణా మంత్రి కిప్చుంబా ముర్కోమెన్ అర్ధరాత్రి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఇలా “జరిగినందుకు నిజంగా చింతిస్తున్నాము, కానీ విమానాశ్రయం చీకటిలో ఉండటానికి ఎటువంటి కారణం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే దేశంలోని చాలా ప్రాంతాలకు విద్యుత్‌ను పునరుద్ధరించినట్లు కెన్యా ప్రభుత్వ విద్యుత్‌ సంస్థ వెల్లడించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here