బుల్లెట్లు మిస్సైనందుకు నగరాన్నే లాక్ డౌన్ చేసిన కిమ్..

0
55

ఉత్తర కొరియా అంటేనే కిమ్ జోంగ్ ఉన్. ఆయన చేసేదే చట్టం, చెప్పేదే న్యాయం కాదని ఎవరైనా ఎదురుతిరిగితే అక్కడిక్కడే మరణించడం ఖాయం. అంతగా ఆ దేశాన్ని గుప్పిట పెట్టుకున్నాడు. ఉత్తర కొరియా గురించి ప్రపంచానికి తెలిసినంతగా, ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. చివరకు తెలుసుకోవాలని ప్రయత్నించినా మరణం తప్పదు. హాలీవుడ్, దక్షిణ కొరియా సినిమాలు చూస్తే, ఇంటర్నెట్ వాడినా, దేశం దాటాలని ప్రయత్నించినా, కిమ్ జోంగ్ ఉన్ తాత, తండ్రులను గౌరవించకపోయినా మరణం తప్పదు. అంత క్రూరంగా అక్కడి చట్టాలు ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా కిమ్ పైత్యం తారాస్థాయికి చేరింది. ఓ సైనికులు 653 అసాల్ట్ రైఫిల్ బుల్లెట్లను పోగొట్టుకున్నందుకు ఏకంగా ఓ నగరాన్నే లాక్ డౌన్ చేశాడు. 653 బుల్లెట్లు దొరికే వరకు నగరాన్ని దిగ్భందించినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 7న ఓ సైనికుడు 653 అటాల్ట్ రూఫిల్ బుల్లెట్‌లను పోగొట్లుకున్నాడు. ఈ ఘటన 2 లక్షల జనాభా ఉండే హైసన్ నగరంలో జరిగింది. దీంతో ఉత్తర కొరియా ఈ నగరం మొత్తాని లాక్ డౌన్ చేసిందని రేడియో ఫ్రీ ఆసియా ఓ నివేదికలో వెల్లడించింది.

మిలిటరీ విత్ డ్రా సమయంలో ఓ సైనికుడు బుల్లెట్లను పోగొట్టుకున్నాడు. దీంతో నగరంలో ప్రతీ చోట సోదాలు చేయాలని కిమ్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 వరకు సైనిక ఉపసంహరణ సమయంలో ఈ ఘటన జరిగింది. దీనిపై అక్కడి ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. బుల్లెట్లు దొరికే వరకు నగరం మొత్తం లాక్ డౌన్ లోనే ఉండనుంది. సైనికుడు బుల్లెట్లను పోగొట్టుకున్న తర్వాత వెతికే ప్రయత్నం చేశారు. అయినా దొరక్కపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడి అధికారులు ప్రావిన్సులోని కర్మాగారాలు, పొలాలు, ఇళ్లు ఇలా ప్రతీ చోట సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడి ప్రజల్లో భయాలు నెలకొల్పేందుకు అధికారులు అబద్ధం చెబుతున్నారని నివేదిక పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here