లిజ్ ట్రస్ కే పార్టీ సభ్యుల మద్దతు.. వెనుకంజలో రిషి సునక్

0
140

బ్రిటన్ ప్రధాని పదవికి జరుగుతున్న పోటీలో రిషి సునక్ వెనకంజలో ఉన్నారు. మరో అభ్యర్థి లిజ్ ట్రస్ మాత్రం దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేల్లో ఆమెకే మొగ్గు కనిపిస్తోంది. గతంలో పీఎం రేసులో అన్ని దశల్లో మొదటి స్థానంలో నిలిచిన రిషి సునక్… ఆ తరువాత జరిగిన డిబెట్లలో లిజ్ ట్రస్ తర్వాత నిలుస్తున్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి.

తాజాగా ఓపినియం రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల అభిప్రాయాలను వెలువరించింది. 450 కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా.. లిజ్ ట్రస్ కు 61 శాతం, మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునక్ కు 39 మంది మద్దతు ఉందని తెలిసింది. రిషి సునక్ 22 శాతం వెనకబడి ఉన్నారు. మొత్తం 2,00,000 మంది కన్జర్వేటివ్ సభ్యులు యూకే ప్రధాని పదవికి కోసం ఓటేస్తున్నారు. వరస కుంభకోణాలు, అవినీతి ఆరోపణలతో బోరిస్ జాన్సన్ తన పదవకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తనకు రిషి సునకే వెన్నుపోటు పొడిచాడని.. ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడుతున్నారు. దీంతో అతని మద్దతుదారులు లిజ్ ట్రస్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

ఓపినియం రీసెర్చ్ సర్వేలో కేవలం 570 శాంపిళ్లతోనే సర్వే చేసింది. వీరిలో 29 శాతం మంది ఇప్పటికే ఓటేయగా.. 47 శాతం మంది తాము ఎవరికి ఓటేయాలో నిర్ణయం తీసుకున్నారు. కేవలం 19 మాత్రమే ఇంకా ఎటూ తేల్చుకులేదు. అయితే సునక్ పట్ల పార్టీ సభ్యుల విముఖతకు కారణం ప్రధానంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కు విధేయతగా ఉండక పోవడమే అని కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు భావిస్తున్నారు. సునక్ రాజీనామాతోనే బోరిస్ జాన్సన్ కాబినెట్ లోని ఒక్కొక్క మంత్రి రాజీనామా చేయడం ప్రారంభించారు. అయితే సునక్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆర్థిక వ్యవస్థ అంశాల్లో లిజ్ ట్రస్ కన్నా ముందున్నారని.. అత్యంత తెలివైనవారని అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here