Hawaii wildfire: మరి ఇంత అదృష్టమా.. మామూలోడు కాదు మనోడు

0
22

హెరికెన్ గాలులతో రాజుకున్న కారు చిచ్చు అమెరికాలోని హవాయి దీవిని ని కాల్చి బూడిద చేసింది.. కని విని ఎరుగని రీతిలో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా విపరీతంగ జరిగింది.. ఇది శతాబ్ద కాలంలోనే అతి భయంకరమైన ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నారు..

ఈ అగ్ని జ్వాలలకి హవాయి దీవి కాలి భూడిదైనది.. ఎక్కడ చూసిన బూడిద కుప్పలే.. అయితే ఇంత విపత్తులోను ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది.. దాన్ని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.. ఎర్రని కప్పుతో తెల్లని గోడలతో చుట్టూ పచ్చదనం తో ఇక్కడ అసలు ప్రమాదం జరిగిందా అని అనుమానం వచ్చేలా ఉంది ఆ ఇల్లు.. ప్రస్తుతతం ఈ ఫోటో నెట్ ఇంట వైరల్ గా మారింది..

శ్రీమతి అట్‌వాటర్ మిల్లికిన్ మరియు ఆమె భర్త డడ్లీ మూడేళ్ల క్రితం వందేళ్ల నాటి పురాతన ఇంటిని సొంతం చేసుకున్నారు..మిల్లికిన్ మాట్లాడుతూ.. మేం పాత భవనాలను ప్రేమిస్తున్నాం.. కాబట్టి మేం భవనాన్ని గౌరవింస్తున్నాం.. మరియు మేం ఆ భవనాన్ని ఏ విధంగానూ మార్చలేదు.. మేం దానిని పునరుద్ధరించాం అంతే అన్నారు..
తారు పైకప్పును హెవీ-గేజ్ మెటల్‌తో చేసిన రూఫ్‌తో భర్తీ చేశారు.. మేము చేయించిన ఈ మార్పే విపత్తు కాలంలో మాకు సాయపడిందని చెబుతున్నారు. తారు పైకప్పు అయితే అది నిప్పు అంటుకుంటుంది.. లేకపోతే, పైకప్పు నుండి పడిపోయి ఇంటి చుట్టూ ఉన్న ఆకులను కాల్చివేస్తుంది.. ఇంటి చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలను కూడా నరికివేసి మా ఇంటికి చుట్టుపక్కల ఉన్న భూమికి బండరాళ్లు చేర్చాము అని ఆ ఇంటి యజమాని తెలిపారు..

ఎరుపు పైకప్పు ఉన్న ఆ ఇల్లు పొరుగు ఆస్తులకు దగ్గరగా లేకపోవడం కూడా మరో కారణం.. మరోవైపు.. దాని పక్కనే సముద్రం, మరో పక్క రోడ్డు మరియు ఖాళీ స్థలం ఉండడంతో మంటలు ఆ ఇంటికి చేరలేకపోయాయి.. మొత్తంగా ఆ ఇంటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here