ఇకే వ్యక్తిలో ఒకే సమయంలో హెచ్ఐవీ, మంకీపాక్స్ కేసులు ఒకే వ్యక్తిలో గుర్తించారు. తాజాగా డెడ్లీ కాంబినేషన్ మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ ఒకే వ్యక్తిలో కనుక్కున్నారు వైద్యులు. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో ఈ డెడ్లీ కాంబినేషన్ కనుక్కోవడంతో వైద్యులు అవక్కయ్యారు. ప్రపంచంలో ఇలా ఇదే మొదటి కేసు అని చెబుతున్నారు.
ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తిలో ఒకే సారి హెచ్ఐవీ, కరోనా, మంకీపాక్స్ ఇన్ఫెక్షన్లను ఒకే సమయంలో గుర్తించారు. మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ కలిసి ఒకే వ్యక్తిలో బయటపడటం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని వైద్యులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ప్రకారం స్పెయిన్ లో ఐదు రోజుల పర్యటన తర్వాత తిరిగి వచ్చిన ఓ వ్యక్తికి జ్వరం, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లక్షణాలు కనిపించిన తర్వాత అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది.
దీని తర్వాత అతని ముఖంపై దద్దర్లు కూడా ఏర్పడటం ప్రారంభం అయింది. దీంతో అతన్ని ఇన్ఫెక్షియస్ డిసీజ్ యూనిట్ కు మార్చారు. దీంతో పాటు కాలేయం వాపు, శరీరంలో ఇతర భాగాలు వాపు చెందడాన్ని డాక్టర్లు గుర్తించారు. ఆ తరువాత టెస్టుల్లో అతనికి మంకీపాక్స్ తో పాటు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. కరోనా వేరియంట్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5.1 సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడు కోవిడ్, మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లో ప్రచురించారు. ప్రస్తుతం అతనికి హెచ్ఐవీ చికిత్స నడుస్తోంది. సరైన లైంగిక జాగ్రత్తలకు పాటించని కారణంగానే హెచ్ఐవీ, మంకీపాక్స్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న మంకీపాక్స్ కేసుల్లో చాలా మంది స్వలింగ సంపర్కులే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.