పాపం దొంగ.. నకిలీ తుపాకీతో దోపిడీకి వెళ్లి, ప్రాణాలు కోల్పోయాడు

0
435

దొంగతనం చేసేందుకు ఒక నకిలీ తుపాకీతో రెస్టారెంట్‌లోకి చొరబడిన ఒక దొంగ.. ప్రాణాలు కోల్పోయాడు. అతని వద్ద ఉన్నది ఫేక్ తుపాకీ అని తెలియక.. ఆ రెస్టారెంట్‌లోని ఒక కమస్టర్, తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఆ దొంగను కాల్చి చంపేశాడు. అమెరికా టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

ఒక దొంగ నకిలీ తుపాకీతో సౌత్ హ్యూస్టన్‌లోని రెస్టారెంట్‌లోకి చొరబడ్డాడు. ఆ నకిలీ తుపాకీ చూపించి, అందులో ఉన్న కస్టమర్లను బెదిరించాడు. ఆ తుపాకీ నిజమేననుకొని, కస్టమర్లు భయంతో అతనికి డబ్బులు ఇచ్చారు. కొందరు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే.. ఒక కస్టమర్ మాత్రం ఆ దొంగను చావుదెబ్బ తీశాడు. అదును చూసి.. తన దగ్గరున్న గన్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. దొంగ పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ, కస్టమర్ వరుసగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాంతో ఆ దొంగ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం ఆ కస్టమర్‌తో పాటు మిగతా వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగ తెచ్చిన తుపాకీని నకిలీ తుపాకీగా నిర్ధారించారు. అయితే.. దొంగను కాల్చి చంపిన ఆ కస్టమర్ ఎవరో ఇంకా తెలియరాలేదు. అతడ్ని పోలీసులు విచారించాల్సి ఉంది. తనని తాను కాపాడుకునేందుకు ఆ కస్టమర్ షూట్ చేశాడు కాబట్టి.. అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here