మంకీపాక్స్ ని ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

0
145

పెరుగుతున్న మంకీపాక్స్ కేసులతో ప్రపంచం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఇటీవల కాలంలో మంకీపాక్స్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 75 దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తం అయింది. మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది. మంకీపాక్స్ వ్యాధిని అసాధారణ సంఘటనగా పరిగణించింది. ఇప్పటికే మంకీపాక్స్ గురించి అత్యవసర సమావేశాలను నిర్వహించింది. తాజాగా శనివారం గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది.

ప్రపంచానికి పెనుముప్పుగా మంకీపాక్స్ వ్యాధిని పరిగణిస్తోంది డబ్ల్యూహెచ్ఓ. ఇటీవల భారత్ లో కూడా మూడు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్ కంట్రీస్ నుంచి కేరళకు వచ్చిన ముగ్గురిలో వైరస్ ను గుర్తించారు. యూకేలో ప్రారంభం అయిన మంకీపాక్స్ కేసులు క్రమంగా యూరోపియన్ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాల్లో కూడా కేేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో 11 శాతం కేసులు ఉన్నాయి. ఇటీవల పలు అధ్యయనాల్లో 95 శాతం కేసులు శృంగారం ద్వారానే సంక్రమిస్తుందని తేలింది. బ్రిటన్ లో ప్రారంభం అయిన వ్యాధి నెమ్మదిగా జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం వంటి దేశాలకు కూడా విస్తరించింది. యూరప్ ఖండంలో లైంగిక సంపర్కాల ద్వారానే వ్యాధి ఎక్కువగా విస్తరించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూరప్ తో పాటు ఇజ్రాయిల్, యూఏఈ, భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధి వల్ల ఐదుగురు మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here