ఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి 11 గంటల 11 నిస్సామిషాల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.. ఈ భూకంపం తీవ్రతకు నగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడాలేకుండా అన్ని చోట్ల పండుటాకుల్లా భవనాలు నేలకూలాయి.. ఈ ఘటనలో వేలమంది మరణించారు..
ఎందరో క్షతగాత్రులయ్యారు.. ఈ భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత మరో భూకంపం 4.9 తీవ్రతతో సంభవించింది.. ఈ భూకంపం అట్లాస్ పర్వతాల్లో ఉన్న గ్రామాల మొదలుకుని చరిత్రాత్మక నగరం మర్రాకేశ్ వరకు విలయ తాండవం చేసింది.. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు..
పెద్దగా అరుస్తూ ఇళ్లలో నుడి బయటకి పరుగులు తీశారు.. ఈ భూకంపాల కారణంగా ఆప్రాంతాల పరిస్థితి దారుణంగా మారింది.. విద్యుత్ నిలిచిపోయింది.. మొబైల్ ఇంటర్నెట్ వ్యవస్థలు స్తంభించిపోయాయి..రహదారులు దెబ్బతిన్నాయి..దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..ప్రస్తుతం సహాయక చర్యలు చేప్పట్టి గాయపడిన వారిని హాస్పిటలకి తరలిస్తున్నారు.. శతాబ్దకాలంలో ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది..
ఈ నేపథ్యంలో కాస్త వెనక్కి వెళ్లి చూస్తే 1960లో మొరాకోలోని అగాదిర్ నగరం సమీపంలో ఒకసారి 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.. కాగా ప్రస్తతం 6.8 తీవ్రతతో సంభవించింది.. ఈ ప్రకంపనలు ఇంకా వచ్చే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో ప్రజలు రోడ్ పైనే ఉంటున్నారు.. కాగా ఈ హృదయ విదారక ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత ప్రధాని మోదీ మృతులకు సంతాపం తెలియచేసారు.