ప్రపంచాన్ని వణికించిన మంకీపాక్స్ పై ఎమర్జెన్సీ ఎత్తివేత

0
67

కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని అంతగా భయపెట్టిన వ్యాధి మంకీపాక్స్. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వేల మందికి వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది. తాజాగా ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మంకీపాక్స్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రకటించారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం కోవిడ్-19 మహమ్మారిపై కూడా అత్యవసర పరిస్థితిని తొలగించారు.

ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 100కు పైగా దేశాల్లో 70,000 కన్నా ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. గతేడాది మే నెలలో బ్రిటన్ లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు యూరప్ లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. బ్రిటన్ తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఇదిలా ఉంటే భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here