Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్‌ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు.. నీరజ్‌ చోప్రా

0
31

ఓడిపోవడం తప్పు కాదు.. ఓడిన చోటే ఆగిపోతేనే ముప్పు.. ఆటలోనైనా జీవిత వేటలోనైనా.. గెలుపోటములు సహజం..వాటిని లెక్క చెయ్యక.. ఆడుపోట్లని అధిగమిస్తూ ముందుకు వెళ్తే విజయం తప్పక వరిస్తుంది.. అని నిరూపించారు త్రోయర్‌ నీరజ్‌చోప్రా..

హంగేరిలోని బుడాపెస్ట్‌ లో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ కనివిని ఎరుగని రీతిలో 88.17 మీటర్ల దూరం జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించాడు.. ఈ మ్యాచ్ లో చెక్‌కు చెందిన వద్లెచ్‌ (86.67) కాంస్యం మీ దక్కించుకోగా.. పాకిస్తాన్ కి చెందిన అర్షద్‌ నదీమ్‌ (87.82) రజతం నెగ్గగా.. భారత్ కి చెందిన నీరజ్ చోప్రా స్వర్ణపతకంని కైవసం చేసుకున్నాడు..

ఇక నీరజ్ చోప్రా గెలుపోటములు పరిశీలిస్తే.. 2016 సంవత్సరం లో జరిగిన ప్రపంచ అండర్‌ 20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచ్చాడు నీరజ్‌ చోప్రా.. ఆ తర్వాత 2017 సంవత్సరం లో జరిగిన ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు.. అయితే ఈ మ్యాచ్ లో నీరజ్ 15 వ స్థానంలో నిలిచాడు.. అనంతరం 2017 సంవత్సరం లోనే భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొని పసిడి పథకం ని సొంతం చేసుకున్నాడు.. ఆ తరువాత 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ బంగారు పతకాలు కైవసం చేసుకున్న నీరజ్..ఎవరూ ఊహించని విధంగా 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు..

2022 సంవత్సరంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొని రజిత పతకంని గెలిచిన నీరజ్‌ చోప్రా.. 2022 ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో స్వర్ణంపథకం తో మెరిశాడు. అదే విజయోత్సాహంతో 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంని దక్కించుకుని భారత జెండాను రెపరెపలాడించాడు. తాజా స్వర్ణంతో నీరజ్‌ అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్‌ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్‌ త్రోయర్‌గా రికార్డులో నిలిచాడు. కాగా ఇప్పటివరకు భారత్ కి ప్రపంచ అథ్లెటిక్స్‌లో 3 పతకాలు రాగ అందులో 2 నీరజ్ చోప్రా సంపాదించినవే కావడం గమనార్హం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here