చాల దేశాలకి టూరిజం ఒక ఆదాయ వనరు.. చెప్పాలంటే కొన్ని దేశాలు ఆ టూరిజం పైనే ఆధారపడి ఉంటాయి.. కాగా ఎక్కడలేని వింత ఒకటి న్యూయార్క్ లో చోటు చేసుకుంది.. చాలామందికి వివిధ పరాంతాలలో ఉన్న వింతలు చూడాలని చాల ఆసక్తి ఉంటుంది.. ఆసక్తి తోనే ఎంత ఖర్చైనా పర్లేదనుకుని పక్షుల్లా ప్రపంచం మొత్తం తిరుగుతుంటారు.. అలా టూరిస్టులని ఆకర్శించే ప్రదేశాలలో న్యూయార్క్ దేశం ఒక్కటి..
న్యూయార్క్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది “స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ”, “సెంట్రల్ పార్క్”, “టైమ్స్ స్క్వేర్”.. కాగా చూసి ఆనందించే మనసు ఉండాలేగాని ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది అన్నట్టు అక్కడ ఉన్న ఎలుకలు విశేషంగా టూరిస్టులని ఆకర్షిస్తున్నాయి.. దీనితో అక్కడ టూరిస్ట్ గైడ్ లు ఇక్కడ ఎలుకల్ని తప్పనిసరిగా చూసి తీరాలంటూ టూరిస్టులలో ఆసక్తిని పెంచుతున్నారు..
అంతే కాదు న్యూయార్క్ ఎలుకలు యుట్యూబ్ లో కూడా వైరల్ అయ్యాయి.. కెన్నీ బోల్ వెర్క్ ఈ ఎలుకల వీడియోలు పెట్టి టిక్ టాక్ స్టార్ అయ్యారు.. అంతే కాదండోయ్ ఈ ఎలక పైన అతడు గంటన్నర పాటు లైవ్ పెడితే వేలాది వీక్షణలు వచ్చాయి.. ఈ ఎలకలపైనా రియల్ న్యూయార్క్ అనే టూరిస్టు ఏజెన్సీ యజమాని ల్యూక్ మిల్లర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎలుకల సంతతిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ నేపథ్యంలో మేము నిర్వహించే సిటీ సందర్శన ప్రదేశాలలో కొలంబస్ పార్క్ ను చేర్చాము అని పేర్కొన్నారు..