North Korea: అభివృద్ధి శూన్యం.. అనుక్షిపణులతో విన్యాసం.. కిమ్

0
22

కిమ్ జోంగ్ ఉన్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. ఎందుకంటే గద్దెనెక్కగా మందబుద్ధి అగమ్య గోచరమాయె ప్రజల పరిస్థితి అన్నట్టు ఉంటుంది కిమ్ పరిపాలన.. నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. విలాసవంతమైన భవనంలో రాజభోగాలు అనుభవిస్తుంటారు.. అక్కడ ప్రజలు మాత్రం ఆకలితో అలమటిస్తుంటారు.. అయినా నాదేశం అభివృద్ధిలో ముందు ఉంది అంటాడు కిమ్..

కిమ్ అరాచక పాలన గురించి ఎంత చెప్పిన తక్కువే.. చిన్న తప్పుకు మరణశిక్ష.. కడుపునిండా తిండి ఉండదు.. కంటినిండా నిద్ర ఉండదు ఆ దేశం ప్రజలకి.. పొరుగు దేశంకి పారిపోదాం అనుకుంటే ప్రాణాలమీద ఆశ వదులుకోవాలి.. ఒక పక్క దేశంలో ఆర్ధిక సంక్షోభంతో అక్కడ ప్రజలు అల్లాడుతుంటే కిమ్ మాత్రం అనుక్షిపణుల విన్యాసంలో ఉన్నట్టు సమాచారం..

నార్త్ కొరియా మీడియా సమాచారం ప్రకారం.. ఉత్తర కొరియా మరోసారి తాను అను క్షిపణులలో అందరి కంటే ముందు ఉన్నట్లు తెలియచెయ్యాలని కీలక చర్యలు చేపట్టింది..
తాజాగా ‘వ్యూహాత్మక అణుదాడి’(టాక్టికల్ న్యూక్లియర్ అటాక్) డ్రిల్ చేపట్టినట్లు ఉత్తరకొరియా పేర్కొంది. ఈ చర్య ద్వారా కిమ్ అమెరికా, దక్షిణ కొరియాలకు తన అణుక్షిపణులతో సవాల్ విసురుతున్నాడు. కిమ్ భవిష్యత్తులో అణుయుద్ధం వస్తే ఎలా తిప్పి కొట్టాలి అనేదానిపైన డ్రిల్ నిర్వహించారు..

అనంతరం ఉత్తర కొరియా మరోసారి తన అణు సమర్థతను చాటుకునేందుకు కీలక చర్యకు పాల్పడింది. కిమ్ జోంగ్ ఉన్ గత కొంత కాలంగా అణుయుద్ధం జరిగినప్పుడు ఈ దేశాల నుంచి దాడుల్ని తట్టుకుని వ్యూహాత్మకంగా అణుదాడి ఎలా చేయాలనేదానిపై డ్రిల్స్ నిర్వహించింది.. న్యూక్లియర్ వార్‌హెడ్లను మోసుకెళ్లే రెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను దేశ పశ్చిమ ప్రాంతం నుంచి ప్రయోగించింది. రెండు క్షిపణులు 150 మీటర్ల ఎత్తులో 1500 కిలోమీటర్లు ప్రయాణించాయి..

అనంతరం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నౌకానిర్మాణం, ఆయుధ కర్మాగారాలను తనిఖీ చేసినట్లు ఆ దేశ మీడియా ఆదివారం నివేదించింది. శతృవులను హెచ్చరించేందుకు ఈ డ్రిల్ నిర్వహించినట్లు వెల్లడించింది. కాగా దక్షిణకొరియా, అమెరికా చేపడుతున్న జాయింట్ మిలిటరీ విన్యాసాలు ముగిసిన 11 రోజలు తర్వాత ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగాలను చేపట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here