Nose Transplant : మొఖానికి ఉండాల్సిన ముక్కు చేతికుందేంటి.. ఇదెక్కడి విచిత్రం రా బాబు?

0
62

Nose Transplant : ఎవరి మొఖానికి అయినా అందం తీసుకొచ్చేది ముక్కే. ముఖానికి అందాన్ని తీసుకొచ్చుకునేందుకు సినీతారలు మొదలుకుని సామాన్యుల వరకు ముక్కుకు పలురకాల సర్జరీలు చేయించుకుంటారు. అందుకు లక్షల రూపాయలు చెల్లిస్తుంటారు. కానీ అలాంటి ముక్కు ముఖానికి కాకుండా చేతికి కనిపిస్తే.. మీరు వింటున్నది విడ్డూరంగా ఉంది కదా ముక్కు ఏంటి.. చేతికి ఉండడం ఏంటి అనుకుంటున్నారా.. నిజమండి బాబు.. ఫ్రాన్స్ లో ఓ మహిళకు ముక్కు చేతికుంది. కావాలంటే ఫోటో చూడండి. కానీ ఆమెకు అది పుట్టుకతో రాలేదండి.. వైద్యులు సృష్టించారు. కారణం ఆ మహిళ క్యాన్సర్ కారణంగా తన ముక్కు భాగాన్ని కోల్పోయింది. దాని స్థానంలో కొత్త ముక్కును ట్రాన్స్ ప్లాంట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రాన్స్‌లోని టౌలౌస్‌కు చెందిన మహిళ క్యాన్సర్ బారిన పడింది. దాంతో 2013లో రేడియోథెరపీ, కీమోథెరపీతో చికిత్స తీసుకుంది. అయితే, చికిత్సలో ముక్కు భాగం కోల్పోయింది. దానిని పునర్నించే ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దాంతో ఆ మహిళ ముక్కు లేకుండానే కొన్నేళ్లనుంచి జీవిస్తోంది. ఇప్పుడు వైద్యులు అద్భుతాన్ని సృష్టించారు. ఆమెకు కొత్త ముక్కు ఇవ్వగలిగారు. మృదులాస్థి స్థానంలో 3డి ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో తయారు చేసిన కృత్రిమ ముక్కును తయారు చేసి ఆమె ముంజేయిపై అమర్చారు. ఆమె స్కిన్ గ్రాఫ్ట్‌ను ఉపయోగించి.. ఆ 3డీ ముక్కును కవర్ చేశారు. ఈ 3డీ ప్రింటెడ్ ముక్కు, చేతికి అతకడానికి రెండు నెలల సమయం పట్టింది. ఆ ముక్కు పూర్తిగా వృద్ధి చెందిన తరువాత.. తిరిగి దానిని ఆమె ముఖానికి అమర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here