మానవత్వం యొక్క మరో రూపం నర్స్ అంటే.. ఎందుకంటే అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యాధి గ్రస్థులకి ఎవరు చేయనటువంటి సేవని నర్స్ లు చేస్తారు.. ఎంతో గొప్ప మనసుంటే తప్ప ఎవరు అల చేయలేరు.. కానీ ఒక నర్స్ 7 మంది నవజాత శిశువుల ని హత్య చేసింది.. అప్పుడే లోకంలో అడుగు పెట్టిన పసికందులని అనంత లోకాలకి పంపింది..
ఇంగ్లాండ్ లో ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో లూసీ లెట్బీ అనే నర్సు విధులు నిర్వహిస్తుంది.. అయితే ఆమెలో పెరిగిన పైశాచికత్వం ఏడుగురు నవజాత శిశువుల ఆయువుని అర్ధాయుష్షుగా మార్చింది.. పసికందులకి పాలు అధికంగా పట్టడం.. నరాలలోకి గాలి నింపడం, పిల్లలను చంపేందుకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, వంటి ఆకృత్యాలకు పాల్పడి 7 మంది పిల్లల్ని చంపడం తోపాటు మరో ఆరుగురు నవజాత శిశువులపైనా హత్యాచారానికి పాల్పడినట్లు అధికారులు కనుగొన్నారు..
భారత సంతతి వైద్యుడు రవి జయరాం నర్స్ చేస్తున్న దుర్మార్గాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు..2015 నుండి ఆమె ఈ దుర్మార్గాలకు పాల్పడుతుందని డాక్టర్ వెల్లడించారు.. తాను ఆ నర్సు గురించి ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే.. ఆ పసికందుల ప్రాణాలు మిగిలిఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు లూసీ లెట్బీ (33)ని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ నర్సును పట్టించడంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ జైరామ్ సహా ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం పిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నారు.