ముస్లిం దేశాల్లో భూ ప్రకంపనలు.. మళ్లీ ఆఫ్ఘాన్‌లో భూకంపం..

0
146

ఇటీవల భారత పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, ఆప్ఘానిస్థాన్‌లలో చోటు చేసుకున్న భారీ భూకంపం నుంచి బయటపడక ముందే మరో దెబ్బ పడింది. మంగళవారం సంభవించిన భూకంప ధాటికి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అంతేకాకుండా సుమారు 1500 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి అయ్యారన్నది ఇంకా తెలియదు. అయితే.. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. భూకంపం ఎఫెక్ట్‌కు ఖోస్ట్‌ ప్రావిన్స్‌ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే పాక్‌టికా ప్రావిన్స్‌లోని బర్‌మలా, జిరుక్‌, నాకా, గియాన్‌ జిల్లాల్లోని ఊర్లపై భూకంప ప్రభావం అధికంగా ఉంది. గియాన్‌ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం మళ్లీ అఫ్గనిస్థాన్‌లో భూకంపం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఫజ్యాబాద్‌కు 76 కిలోమీటర్ల దూరంలో.. 163 కిలోమీటర్ల లోతున భూకంపం సంభించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం ప్రభావం రిక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదైంది. ప్రకంపనలతో వణికిపోయిన ప్రజలు.. వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here