ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యాడటే ఆ తప్పు పాఠం చెప్పిన మాష్టారిది.. ఒక దేశం వెనకబడింది అంటే ఆ తప్పు ఆ దేశ ప్రభుత్వానిది.. ఒక నాయకునికి శక్తీ, యుక్తి రెండూ ఉండాలి.. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ దేశంలో పురోగాభివృధి ఉండదు.. దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది మన దాయాధి దేశం పాకిస్తాన్..
పాకిస్తాన్ ఎప్పుడు భారత్ తో పోటీ పడాలనే చూస్తుంటుంది.. నాకు ఒక్క కన్ను పోయిన పర్లేదు ఎదుటి వారికి రెండు కళ్ళు పోవాలి అనుకునే కుంచిత స్వభావం పాక్ ది.. ఈ లక్షణమే పాక్ పతనానికి కారణం అయింది .. ప్రతి రంగంలో భరత్ తన ప్రతిభను చాటుకుంటుంటే.. దాయాధి దేశం మాత్రం మన్ను తిన్న పాము లెక్క, ఏడేసిన గొంగళి ఆడానే అన్నట్లుంది.. అని పాక్ ప్రజలు మరియు మీడియా కోడై కూస్తుంది..
భారత ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం పైన దింగింది.. అమెరికా రష్యా వంటి దేశాలు సాధించలేని ఘనతను భారత్ సాధించింది.. దీనితో ప్రపంచవ్యాప్తంగా భారత్ పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్న సమయంలో దాయాధి దేశం అయినా పాక్ మాజీ మంత్రి . ఫవాద్ చౌధరీ కూడా భారత్ విజయం పైనా స్పందిస్తూ అభినందనలు తెలియచేసారు.. కాగా పాక్ లో ప్రజలు మరియు మీడియా పాక్ ప్రభుత్వాన్ని నిందించంలో బిజీ గా ఉన్నారు.. ఇక్కడ ప్రజలు ఆహార కొరతతో అల్లాడుతుంటే ఇక అంతరిక్షం గురించి ఎం ఆలొచ్చిస్తారు అని ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు..
వాస్తవానికి భారత్ కంటే ముందే పాక్ లో స్పేస్ ఏజెన్సీ స్థాపన జరింగింది.. స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమిషన్ పేరుతో స్థాపించిన SUPARCO 62 సంవత్సరాలలో కేవలం 5 ఉపగ్రహాలనే పంపగలింది.. దీనికి కారణం అక్కడి ప్రభుత్వం స్పేస్ ఏజెన్సీ పైన ద్రుష్టి పెట్టకపోవడమే.. నిజాకి మొదట్లో, పాకిస్తాన్ తనను తాను సూపర్ పవర్‌గా మార్చుకోవాలనే నిర్ణయించుకుంది. కానీ దేశంలోని అస్థిర ప్రభుత్వాలు, సైన్యం తిరుగుబాటు వల్ల ఎదగలేకపోయింది. తదనంతరం ఎక్కువ డబ్బును సైనిక శక్తిని పెంచడానికి, క్షిపణుల పర్యవేక్షణకు వెచ్చించింది.. దీనితో అభివృద్ధి పరంగా వెనకబడింది పాక్.. ప్రస్తుతం భారత అంతరిక్ష సంస్థ నిధులు పాకిస్థాన్‌తో పోలిస్తే 70 రెట్లు ఎక్కువ.