ఒక నాయకునికి అంగబలం అర్ధ బలం కంటే బుద్ది బలం అనేది చాల ముఖ్యం.. ఎందుకంటే బుద్ది బలం ఉంటె మిగిలిన రెండు బలాలు వాటంతట అవే వస్తాయి.. కానీ మన దాయాధి దేశం నాయకులు కనీస ఆలోచన లేకుండా నోటికి ఇది వస్తే అది మాట్లాడి అక్కడి ప్రజల విమర్శలకు గురైన సంఘటనలు కోకొల్లలు.. అలంటి ఘటనే తాజాగా మళ్ళీ చోటు చేసుకుంది..
పాక్ లో అభివృద్ధి సూన్యం.. అరాచకాలు అధికం.. అనే విషయం అందరికి సుపరిచితమే.. కాగా ప్రస్తుతం పాక్ లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.. గతకొద్ది కాలంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి.. దొంగలు బహిరంగానే తుపాకులతో ప్రజలను బెదిరించి వాళ్ళ సంపదను దోచుకుంటున్నారు.. ఇక మొబైల్ ఫోన్ దొగతనాలకి, దోపిడీలకు పాక్ అడ్డాగా మారింది.. పెరుతున్న క్రైమ్ రేటు తో అక్కడ ప్రజలు సతమతమౌతూ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు..
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ కేర్‌టేకర్ మంత్రి, బ్రిగేడియర్ (రిటైర్డ్) హరీస్ నవాజ్ ప్రస్తావిస్తూ వింత వ్యాఖ్యలు చేశారు.. దొంగలు దోచుకోలేని ప్రదేశంలో మొబైల్ ఫోన్ దాచుకోవాలి అన్నారు.. ప్రజలు మొబైల్ ఫోన్స్ ని వాళ్ళ జేబుల్లో దాచుకోవాలి..ఇలా చేయడం వల్ల దొంగలు ఫోన్స్ ని దోచుకోలేరు..
నేరాలను తగ్గించేందుకు పౌరులు కూడా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలి.. అని మంత్రి వెల్లడించారు.. కాగా మంత్రి చేసినఈ అనాలోచిత వ్యాఖ్యలపైన అక్కడ ప్రజలు మండిపడుతున్నారు.. బాధ్యతగల నాయకుడై ఉంది ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడం ఏమైనా సమంజసంగా ఉందా అని విమర్శల జల్లును కురిపిస్తున్నారు..