పాక్‌ ప్రధాని తిప్పలు.. పుతిన్ వెకిలి నవ్వులు!

0
147

ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో భాగంగా వ్లాదిమిర్ పుతిన్‌ను పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్ కలిశారు. పుతిన్‌తో భేటీ సందర్భంగా షరీఫ్ అవస్థలు పడ్డారు. ఆయన అవస్థలు చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ముసిముసిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

ఈ సమావేశానికి ముందు పుతిన్‌ తన చెవిలో ఇయర్‌ఫోన్స్ వంటి పరికరాన్ని పెట్టుకున్నారు. పాక్‌ ప్రధాని మాత్రం తన చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఎవరైనా వచ్చి సాయం చేయండంటూ వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. ఓ సహాయకుడు వచ్చి ఇయర్‌ఫోన్‌ను పెట్టి వెళ్లిపోయారు. మళ్లీ కాసేపటికి అది చెవిలో నుంచి ఊడి కిందపడింది. మళ్లీ సహాయకుడు రావాల్సి వచ్చింది. ఈ తతంగమంతా చూస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ బయటకు వినబడేలా పగలబడి నవ్వారు.

ఈ వీడియోను పీటీఐ పార్టీ నేత ఒకరు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ క్రెం మినిస్టర్ పాకిస్థాన్‌కు తలవంపులు తెస్తున్నారని కామెంట్ చేశాడు. ఈ సంఘటన దేశానికి “అవమానకరం” అని పేర్కొంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here