ఇమ్రాన్ ఖాన్ కు ఉపశమనం.. విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు..

0
67

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనను అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’’(ఎన్ఏబీ) ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది.

ఈ కేసులో అరెస్టును సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్ ఛాలెంజ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ హైకోర్టులో అరెస్ట్ చేసిన తీరుపై సీజేఐ ఉమర్ అటా బండియాల్, మరో ఇద్దరు న్యాయమూర్తులు మహ్మద్ అలీ మజార్, జస్టిస్ అథర్ మినల్లాతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతకుముందు ఎన్ఏబీకి పాక్ సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. గంటలోపు ఇమ్రాన్ ఖాన్ ను తమ ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత్యంతరం లేక ఎన్ఏబీ సుప్రీం ముందు ఇమ్రాన్ ను ప్రవేశపెట్టింది. కోర్టు రిజిస్టార్ అనుమతి లేకుండా కోర్టులోకి ప్రవేశించి ఇమ్రాన్ ను అరెస్ట్ చేయడం హక్కులను ఉల్లంఘించడమే అని తెలిపింది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు 90 నుంచి 100 మంది రేంజర్స్ కోర్టులోకి ప్రవేశించారని, ఇలాంటప్పుడు కోర్టుల ప్రతిష్ట ఏం కావాలి..? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here