మార్స్ పై జీవం ఆనవాళ్లు.. ఆర్గానిక్ పదార్ధాలను గుర్తించిన పర్సవరెన్స్ రోవర్

0
117

భూమి తర్వాత ఇతర గ్రహాలపై జీవులు ఉనికిపై దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు 5000 పైగా ఎక్సొో ప్లానెట్లను కనుకున్నప్పటికీ.. ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూమి లక్షణాలు ఉన్న గ్రహాలను మాత్రం వెలుగులోకి రాలేదు. అయితే మన సౌరవ్యవస్థలో భూమి తరువాత జీవాల నివసించేందుకు అంగారకుడిపై అనవైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే అనేక కృత్రిమ ఉపగ్రహాలను, రోవర్లను మార్స్ పైకి పంపారు.

గతేడాది ఫిబ్రవరిలో నాసా పర్సవరెన్స్ రోవర్ ని మార్స్ పైకి పంపింది. మార్స్ ఒకప్పుడు సముద్రాలు, నదులు, సరస్సులను కలిగి ఉండేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. ఇప్పటికీ అరుణ గ్రహంపైన సరస్సులు, నదీ ప్రవాహకాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. అంతకు ముందు నాసా పంపిన క్యూరియాసిటీ రోవల్, అంగారకుడిపైన గేల్ క్రేటర్ వద్ద పరిశోధనలు సాగిస్తోంది. అక్కడి నమూనాలను విశ్లేషిస్తోంది. గతేడాది పంపిన పర్సవరెన్స్ రోవర్ జెజెరో క్రేటర్ వద్ద పరిశోధనలు జరుపుతోంది.

ఇదిలా ఉంటే పర్సవరెన్స్ జీవానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. జెజెరో బిలం వద్ద రోవర్ పురాతన నది డెల్టా నుండి నాలుగు నమూనాలను సేకరించింది, ఇది పురాతన సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆనవాళ్లు కనుక్కునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో సేంద్రీయ రసాయన పదార్ధాలను పర్సవరెన్స్ రోవర్ గుర్తించింది. సేంద్రీయ అణువులు ప్రధానంగా కార్బన్‌తో తయారు చేయబడిన అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉన్నాయని.. సాధారణంగా హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

మార్స్ పై ఉన్న జెజిరో క్రేటర్ వద్ద ఇసుకరాయి, రాతి శిలలు, బురద రాయిపై పర్సవరెన్స్ పరిశోధనలు చేస్తోంంది. ఇందులో సేంద్రీయ రసాయన పదార్థాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్త కెన్ ఫార్లే వెల్లడించారు. అయితే ఇది మాత్రమే జీవాల ఉనికికి సంబంధించిన స్పష్టతను పూర్తిగా ఇవ్వలేదని.. ఈ నమూనాలను భూమిపైకి తీసుకువచ్చినప్పుడు మాత్రమే అధ్యయనం చేయవచ్చని.. ఆ తరువాతే ఓ అంచనాకు రావచ్చని ఆయన వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here